ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు - etv bharat headlines

ETV BHARAT LATEST TOP NEWS
ETV BHARAT LATEST TOP NEWS
author img

By

Published : Nov 19, 2021, 6:36 AM IST

Updated : Nov 19, 2021, 10:30 PM IST

22:03 November 19

టాప్​న్యూస్​@ 10PM

  • వేతనాల పెంపు నిర్ణయం ఉపసంహరణ

పట్టణ ప్రాంత స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల (urban local representatives honorarium) పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకొంది. మేయర్లు, ఛైర్​పర్సన్లు, డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ ఛైర్​పర్సన్లు, కార్పొరేషన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యుల గౌరవ వేతనాలు 30 శాతం పెంచుతూ పురపాలకశాఖ నిన్న(నవంబర్​ 18) ఉత్తర్వులు జారీచేసింది. 

  • విగ్రహానికి వైద్యం చేయలేదని ఆగ్రహం

జిల్లా ఆసుపత్రికి శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి చెయ్యి విరిగిన 'లడ్డూ గోపాల్'​తో వచ్చాడు. 'లడ్డూ గోపాల్'​కు వెంటనే కట్టుకట్టాలని డిమాండ్​ చేశాడు. అందుకు సిబ్బంది ఒప్పుకోకపోయేసరికి నానా హంగామా చేశాడు. చివరికి అతడిని శాంతపరచడానికి చికిత్స చేసేందుకు ఒప్పుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే...

  • వాహనదారుడి తలపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు

మధ్యప్రదేశ్​లోని బైతూల్​ జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. మలుపు తిరుగుతుండగా అదుపు తప్పి పడిపోయిన ఓ ద్విచక్రవాహదారుడి తలపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో బైకర్​ ప్రాణాలు కోల్పోయాడు

  • 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్​ డోసు!

అమెరికాలో 18 ఏళ్లు పైబడిన వారందరూ కరోనా వ్యాక్సిన్ బూస్టర్​ డోసు తీసుకోవచ్చని ఔషధ నియంత్రణ మండలి తెలిపింది. కొత్త కేసులు పెరుగుతుండటం, క్రిస్​మస్​ దగ్గరపడుతున్న నేపథ్యంలో వైరస్​ను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

  • కమలా హారిస్​కు అమెరికా అధ్యక్ష బాధ్యతలు!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. తన అధ్యక్ష బాధ్యతలను కమలా హారిస్​కు బదిలీ చేయనున్నారు. బైడెన్​కు కోలనోస్కోపీ పరీక్ష జరగనున్న నేపథ్యంలో తన బాధ్యతలను కమలా హారిస్​కు అప్పగించనున్నారు.

21:44 November 19

టాప్​న్యూస్​@ 9PM

  • రద్దీగా శైవ క్షేత్రాలు

రాష్ట్రవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో శైవ క్షేత్రాలకు క్యూకట్టారు. దీపాలు వెలిగించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు.

  • 'ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది'

ధాన్యం విషయంలో రైతులు ఆందోళన పడొద్దని.. వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అభయం ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి... కొనుగోలు తీరును పరిశీలించారు (Harish Rao visit grain purchasing centers).

  • ఆ టీస్టాల్​ ఓనర్​ విజయన్​ కన్నుమూత

విదేశీ పర్యటనలతో గుర్తింపు సంపాదించుకున్న టీ స్టాల్​ ఓనర్​ కేఆర్​ విజయన్​ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. విజయన్​-మోహన దంపతులు.. 14 ఏళ్లలో 26 దేశాలు చుట్టేశారు.

  • 11నెలలకే స్నోబోర్డింగ్​!

చైనాలో 11నెలల చిన్నారి వాంగ్​ యుజి.. స్నోబోర్డ్​తో కుస్తీపడుతోంది. ముద్దుముద్దు చేష్టలతో యుజి స్నోబోర్డింగ్​ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. క్రీడలపై మక్కువ ఉన్న ఆమె తల్లిదండ్రులు.. యుజికి ఇప్పటి నుంచే పాఠాలు నేర్పించేస్తున్నారు.

  • 'ఆర్ఆర్​ఆర్​'లో అజయ్​ దేవ్​గణ్ పాత్ర ఇంతేనా?

'ఆర్​ఆర్​ఆర్' సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్​గణ్ పాత్రకు (Ajay Devgan In Rrr) సంబంధించి ఆయన అభిమానులు నిరాశకు గురయ్యే విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఆయన చాలా తక్కువసేపు మాత్రమే కనిపించనున్నారని తెలుస్తోంది.

19:58 November 19

టాప్​న్యూస్​@ 8PM

  • 'రైతులకు కేసీఆర్ అండగా నిలవడంతోనే'

Centre to Repeal Of 3 Farm Laws) మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవడంపై తెరాస ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. రైతులకు అండగా కేసీఆర్ (CM KCR) నిలవడంతోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి సాగు చట్టాలను రద్దు చేసిందని (Centre to Repeal Of 3 Farm Laws) పేర్కొన్నారు. కేసీఆర్ మహాధర్నా (TRS Maha Dharna) చేయడంతో దేశంలో కదలిక వచ్చిందని చెప్పారు.

  • రూ.3.5వేల కోట్లతో అభివృద్ధి పనులు

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తర్​ప్రదేశ్​లో పర్యటించిన మోదీ(PM Modi in UP).. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అల్ట్రామెగా సోలార్ పవర్ పార్క్, రక్షణ ఉత్పత్తుల ప్లాంట్​లకు శంకుస్థాపన చేశారు. అటల్ ఏక్తా పార్క్​ను (PM Modi news) ఆవిష్కరించారు. అదే సమయంలో ఎన్​సీసీ అలమ్నీ అసోసియేషన్​ను ప్రారంభించి.. తొలి సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నారు.

  • బెంగళూరులో రెండు రోజులు స్కూళ్లు బంద్​

తమిళనాడు, కర్ణాటకలో వరుణుడి బీభత్సానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వచ్చే నాలుగు రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో బెంగళూరులో స్కూళ్లకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. పరిస్థితిపై సీఎం బసవరాజ్ బొమ్మై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

  • సెమీస్​కు దూసుకెళ్లిన సింధు, శ్రీకాంత్

ఇండోనేషియా మాస్టర్స్​లో (Indonesia Masters 2021) ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్​లో ప్రత్యర్థి ఇగిట్​ను చిత్తుగా ఓడించి సెమీస్​కు దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్​లో హెచ్​ఎస్​ ప్రణయ్​ను ఓడించి సెమీస్​కు చేరుకున్నాడు శ్రీకాంత్.

  • 'ఆ పాత్రలో ఆమిర్ ఖాన్​ నటిస్తే బాగుంటుంది'

తన జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించే పనులు జరుగుతున్నాయని చెస్ గ్రాండ్ మాస్టర్​, మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్(Viswanathan anand biography) స్పష్టం చేశారు. తన పాత్రలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటిస్తే బాగుంటుందని అన్నారు.

18:52 November 19

టాప్​న్యూస్​@ 7PM

  • కొట్టుకుపోయిన శ్రీవారి మెట్టు మార్గం

భారీ వర్షాలు తిరుమలలో జల ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు సహా పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు తిరుగిరులు అతలాకుతలం అయ్యాయి. తిరుమల శ్రీవారి మెట్ల దారిలో పరిస్థితి ఎలా ఉందో చూడండి..

  • దున్నపోతు ధర రూ.24 కోట్లు

దున్నపోతుల ప్రదర్శనలో (pushkar fair rajasthan) 'భీమ్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 6 అడుగుల ఎత్తు, 14 అడుగుల పొడవుతో ఉన్న ఈ దున్న విలువ రూ.24 కోట్లు అని దాని యజమాని తెలిపారు. దీని వీర్యాన్ని విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు.

  • 'సాగు చట్టాలు ఇప్పుడే రద్దైనట్టు కాదు'

మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినా(farm laws repeal).. ఈ చట్టాలను ఇప్పటికిప్పుడే ఉపసంహరించుకున్నట్లు కాదు. దీనికి రాజ్యాంగ ప్రక్రియ (farm law repeal process) పూర్తి చేయాల్సి ఉంటుంది. చట్టాల ఉపసంహరణ కోసం బిల్లును (farm laws taken back) పార్లమెంట్​లో ప్రవేశపెట్టి.. ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ఉపసంహరణ బిల్లు చట్టరూపం దాల్చితే.. సాగు చట్టాలపై సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాలు సైతం నిరూపయోగంగా మారిపోతాయి.

  • కోహ్లీ భావోద్వేగం

క్రికెట్​లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు (AB De Villiers Retirement) దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్​ ప్రకటన పట్ల భావోద్వేగానికి గురయ్యాడు విరాట్ కోహ్లీ (Virat Kohli). ఈ నిర్ణయం తనను ఎంతో బాధకు గురిచేస్తోందని అన్నాడు. 

  • బంగార్రాజు డైరీ బ్యూటీ

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. 'బంగార్రాజు' డైరీ అందంతో పాటు సూర్య కొత్త సినిమా రిలీజ్ డేట్ విషయాలు ఇందులో ఉన్నాయి. హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్​బర్గ్, బాలీవుడ్​​ రణ్​బీర్ కపూర్ కొత్త సినిమా విడుదల తేదీలు కూడా తెలుసుకోండి.

17:58 November 19

టాప్​న్యూస్​@ 6PM

  • జల విషాదం

ఏపీలోని కడప జిల్లాలో వరద పోటు 12 మందిని బలిగొంది. రాజంపేట మండలం నందలూరు వెళుతున్న మూడు ఆర్టీసీ బస్సులు... వరదనీటిలో చిక్కుకు పోయాయి. నందలూరు సమీపంలో ఉదయం నుంచి వరదలోనే ఉన్న ఆర్టీసీ బస్సుల్లోని సిబ్బంది, కొందరు ప్రయాణికులు.... ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయారు. 

  • మరో ప్రమాదం

మంచిర్యాల జిల్లా (mancherial district)  మందమర్రి ఏరియా కల్యాణి ఉపరితలగనిలో (kkoc project mandamarri) ప్రమాదం జరిగింది. విధుల్లో ఉన్న అధికారిపై బొగ్గు పెళ్లపై పడి మృతి చెందారు.

  • స్టార్​ నటుడి కుమారుడికి చేదు అనుభవం

స్టార్​ నటుడు జయరామ్​ తనయుడు కాళిదాస్​ జయరామ్​కు(kalidas jayaram news) చేదు అనుభవం ఎదురైంది. ఓ వెబ్​ సిరీస్​ షూటింగ్​ కోసం మున్నార్​ వెళ్లిన కాళిదాస్​ను హోటల్​ సిబ్బంది బంధించారు(kalidas jayaram hotel). హోటల్​ బిల్లు కట్టలేదని, అందుకే వెబ్​ సిరీస్​ బృందాన్ని బంధించినట్టు హోటల్​ యాజమాన్యం తెలిపింది.

  • 'ఏదో ఒక రోజు అమెరికాపై చైనా అణుదాడి'

అమెరికాపై చైనా ఏదో ఒక రోజు అనూహ్యంగా అణు దాడికి పాల్పడే సామర్థ్యం(us china missile) కలిగి ఉంటుందని అగ్రరాజ్యం సైన్యాధికారి హెచ్చరించారు. ఈ ఏడాది జులైలో చైనా హైపర్​సోనిక్​ క్షిపణి.. ప్రపంచాన్ని చుట్టిందని తెలిపారు(China hypersonic missile). ఈ ఆయుధం ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించగలదని వివరించారు.

  • 'అద్భుతం' అనిపించాడా?

తేజ, శివానీ రాజశేఖర్‌ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అద్భుతం' సినిమా... ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తేజ ఈ సినిమాతో నిజంగానే 'అద్భుతం' అనిపించాడా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ(Adbhutam review) చదివేయండి.

16:52 November 19

టాప్​న్యూస్​@ 5PM

రానున్న 3 రోజులు మోస్తరు వర్షాలు

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains in Telangana) కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి- చెన్నై మధ్యలో తీరాన్ని దాటిందని.. క్రమంగా అది బలహీనపడనుందని పేర్కొంది. మరో 6గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.

  • 'సాగు చట్టాలు మంచివే'

సాగు చట్టాల రద్దుపై ప్రధాని మోదీ(pm modi news) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్​ స్వాగతించారు(farm laws repealed). అయితే చట్టాలతో ప్రయోజనాలే ఎక్కువని, వాటిని రైతుల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని అభిప్రాయపడ్డారు. 

  • ఇక 'క్రిప్టో' ఆదాయంపైనా పన్ను..!

క్రిప్టోకరెన్సీని(cryptocurrency news) ఆదాయపు పన్ను​ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం(india crypto news). ఇందుకు తగ్గట్టుగా ప్రస్తుత చట్టాల్లో మార్పులు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది(crypto taxation india). వచ్చే బడ్జెట్​ సమావేశాల్లో ఈ మార్పులు కనిపించే అవకాశమున్నట్టు ఓ అధికారి వెల్లడించారు.

  • అన్ని ఫార్మాట్లకు డివిలియర్స్ గుడ్​ బై

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్(De villiers retirement) క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు. క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకు దూరం కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

  • ఐకాన్​ స్టార్​ భార్య స్నేహా రెడ్డి రికార్డ్!

ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి(Allu arjun wife) ఇన్​స్టాగ్రామ్​లో 60 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇతర నటుల భార్యలకు లేనంత మంది ఫాలోవర్లు స్నేహకు తక్కువ రోజుల్లోనే రావడం గమనార్హం.

15:54 November 19

టాప్​న్యూస్​@ 4PM

  • 'తెదేపా అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలో అడుగుపెడతా..'

ఏపీ అసెంబ్లీలో తన భార్య గురించి వైకాపా సభ్యులు నీచంగా మాట్లాడారంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు (Chandra Babu Naidu News)భావోద్వేగానికి గురయ్యారు. తెదేపా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశం మధ్యలో వెక్కివెక్కి ఏడ్చారు. తిరిగి తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాతే తాను అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు.

  • పూలతో నిండిపోయిన వాటర్​ పార్క్

నాసిక్​లో వాటర్ పార్క్ రంగురంగుల (Flower garden in Nashik) పూలతో ఆకట్టుకుంటోంది. అదేంటి వాటర్​ పార్క్​లో పూలు ఎందుకు ఉంటాయని అనుకుంటున్నారా! లాక్​డౌన్​ కారణంగా వాటర్ పార్క్​ను పూల పార్క్​గా మార్చారు నిర్వహకులు. రంగురంగుల పూలతో ఇంద్రలోకాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. మనమూ ఓసారి చూసొద్దాం పదండి.

  • ఆ దేశంలో కరోనా ఫిఫ్త్​ వేవ్​ భయం

కొవిడ్​ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మరోసారి లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ఆస్ట్రియా ప్రకటించింది. సోమవారం ప్రారంభమయ్యే ఈ లాక్​డౌన్​ 10 రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించింది.

  • 'పాక్​లో నిర్వహించే సిరీస్​ల నుంచి భారత్​ వైదొలగలేదు!'

పాకిస్థాన్​లో నిర్వహించే ఐసీసీ టోర్నీల నుంచి టీమ్​ఇండియా (India vs Pakistan) వైదొలుగుతుందని తాను భావించడంలేదని చెప్పాడు పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా (Ramiz Raja). ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని, అయితే త్రైపాక్షిక సిరీసుల్లో తలపడే అవకాశం ఉందని అన్నాడు.

  • ఈ హీరోయిన్లు వ్యాపారాల్లోనూ తగ్గేదేలే!

ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ ముగిస్తేనే రెండో ఇన్నింగ్స్‌! ఇది క్రికెట్‌లో నిబంధన. కానీ, మన హీరోయిన్లకు అంత ఓపిక లేదండోయ్‌! యాక్టింగ్‌ కెరీర్‌ ముగియకముందే వ్యాపారం(Actresses in business) అనే రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టేస్తున్నారు. సిక్సర్లు బాదేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేలా! ఇంతకీ ఎవరు ఏ వ్యాపారాల్లో ఉన్నారు? అని తెలుసుకోవాలనుందా? ఇవిగో ఆ వివరాలు..

14:42 November 19

టాప్​న్యూస్​@ 3PM

ఏపీ అసెంబ్లీ పరిణామాలపై తెదేపా అధినేత చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. మీడియా సమావేశంలో ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు.

  • తాలిబన్లపై విమర్శలు చేసిందని..!

తాలిబన్లను విమర్శించిదన్న కారణంతో ఓ సామాజిక కార్యకర్త ఫోన్​ నంబర్​ను పోర్న్ సైట్లలో పెట్టారు దుండగులు. దీంతో ఆమెకు ఫోన్​ కాల్స్, మెసేజ్​లు రావడం ప్రారంభమైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ.

  • వంతెన​ కింద వేలాడిన 9 మృతదేహాలు

ప్రధాన రహదారిలోని పైవంతెనకు వేలాడుతున్న 9 మృతదేహాలను(bodies found in mexico) అధికారులు గుర్తించారు. మరో మృతదేహం దారిపక్కన కనిపించింది. మెక్సికోలోని జకాటెకాస్​లో(bodies found in mexico 2021 ) ఈ సంఘటన జరిగింది. ఇంతకూ ఆ మృతదేహాలు ఎక్కడివి?

  • సెమీస్​లో హైదరాబాద్

సయ్యద్​ ముస్తాక్ అలీ ట్రోఫీలో(syed mushtaq ali trophy) హైదరాబాద్​ జట్టు వరుసగా విజయాలతో ముందంజలో నిలుస్తోంది. శనివారం సెమీస్​లో తమిళనాడు జట్టుతో(HYD vs TN semi final) తలపడనుంది.

  • ఆ నిర్ణయంపై.. సినీ ప్రముఖులు ఏమన్నారంటే?

వ్యవసాయ చట్టాలు రద్దు(farmer laws) చేయడంపై బాలీవుడ్​కు చెందిన పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

14:09 November 19

టాప్​న్యూస్​@ 2PM

చంద్రబాబు భావోద్వేగం

ఆ 700 మంది రైతుల ప్రాణాలు దక్కేవి

సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటనను వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వాగతించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎన్నికల గిమ్మిక్కుగా కొందరు అభివర్ణించగా.. మరికొందరు అన్నదాతల అద్భుత పోరాటానికి ప్రతీకగా పేర్కొన్నారు.

అన్నదాతల విజయం!

రైతుల పోరాటానికి(farmers protest) కేంద్రం దిగొచ్చింది. నూతన సాగు చట్టాలను(Farm laws) రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు. ఏడాది కాలంగా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని.. వెనుదిరగకుండా నిరసనలు కొనసాగించారు రైతులు. వ్యవసాయ చట్టాలపై కర్షకుల పోరాటం తీరును ఓసారి పరిశీలిద్దాం.

కుప్పకూలిన ఇల్లు- 9 మంది మృతి

భారీ వర్షాల కారణంగా (Rain in Tamilnadu) ఇల్లు కూలి 9 (house collapse news) మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని వెల్లూర్​లో ఈ ఘటన జరిగింది.

బీటెక్​ కూడా అయిపోతోంది

'ఆర్ఆర్ఆర్' సినిమా నాలుగేళ్లు గడిచింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్​ ట్వీట్ చేయగా, దానికి చిత్రబృందం ఆసక్తికరంగా రీట్వీట్ చేసింది.

12:45 November 19

టాప్​న్యూస్​@ 1PM

  • 'ఇది దేశ రైతుల విజయం'

సాగు చట్టాల రద్దు ప్రకటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth on farm laws) స్పందించారు. ఇది రైతుల విజయమని కొనియాడారు. పార్లమెంట్‌లో సాగు చట్టాలకు అనుకూలంగా కేసీఆర్‌ ఓటేశారన్న రేవంత్... కేసీఆర్ ఘనతగా(Revanth reddy on kcr) చెప్పడం రైతులను అవమానించడమేనని ఆరోపించారు.

  • 'కేసీఆర్ పోరాట సంకేతం..'

నూతన సాగు చట్టాల రద్దు(farm laws withdrawn 2021)ను స్వాగతించిన తెరాస.. ఇది అన్నదాతల విజయంగా అభివర్ణించింది. దక్షిణాదిలోనూ రైతు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడే ప్రమాదం ఉందని గ్రహించే కేంద్రం వెనక్కి తగ్గిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(minister niranjan reddy) అన్నారు.

  • 'వరంగల్​ జిల్లానే నంబర్​ వన్'

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ (Warangal Political Leaders)​కు పెద్దపీట లభించడంపై గులాబీ సేనలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకేసారి ముగ్గురికి మండలి సభ్యత్వం దొరకడంతో.. జిల్లాకు సర్కార్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

  • 'వాళ్లను పక్కనపెట్టడం కష్టమే'

టీమ్​ఇండియాలో మేటి యువ ఆటగాళ్లున్నారని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్(Ricky Ponting News) అన్నాడు. ఈ నేపథ్యంలో సీనియర్​ ఆటగాళ్లపై విమర్శలు వచ్చాయని అభిప్రాయపడ్డాడు.

  • కింగ్‌తో 'జాతిరత్నాలు' బ్యూటీ

'బంగార్రాజు' సినిమా గురించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. యువనటి ఫరియా అబ్దుల్లా.. నాగ్​తో కలిసి స్పెషల్ సాంగ్​ చేయనుందట.

11:58 November 19

టాప్​న్యూస్​@ 12PM

  • చట్టాల రద్దు.. వ్యూహాత్మకమా? 

గతేడాది తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే పార్లమెంటు ఆమోదం పొందిన ఏడాది తర్వాత.. సాగు చట్టాలపై మోదీ సర్కార్​ వెనక్కి తగ్గడానికి కారణమేంటి? ఇది ఉత్తర్​ప్రదేశ్​ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే ఎత్తుగడా? రైతు నిరసనలను ఎదుర్కోలేక వెనక్కి తగ్గడమా?

  • రైతులు సాధించిన విజయం : రాహుల్

కేంద్రం అహంకారంపై రైతులు సత్యాగ్రహ మార్గంలో విజయం సాధించారని సీనియర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సాగు చట్టాల రద్దుకోసం సుదీర్ఘ పోరాటం చేసిన అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు.

  • వరద ధాటికి కుప్పకూలిన భవనం

ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుచానూరులో వరద ధాటికి ఓ ఇల్లు కుప్పకూలింది.

  • కౌశిక్.. కంగ్రాట్యూలేషన్స్

రైతులపై కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఇందిరాపార్కులో మహాధర్నా(TRS Maha dharna 2021) చేసిన తెరాస నేతలు ధర్నా అనంతరం రాజ్​భవన్​లో గవర్నర్(telangana governor tamilisai)​ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి(padi kaushik reddy) గవర్నర్​ను కలిసి తనను పరిచయం చేసుకోగా.. తమిళిసై 'కంగ్రాట్యులేషన్స్' అంటూ అభినందనలు తెలిపారు. ఈ దృశ్యం చూసిన తెరాస నేతలు ఆ ప్రాంగణంలో నవ్వులు పూయించారు.

  • 'ఇది నా అడ్డా' సాంగ్ వచ్చేసింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా 'పుష్ప'. ఇందులోని నాలుగో పాట 'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' లిరికల్ పాట రిలీజైంది. పూర్తి మాస్​లుక్​లో కనిపిస్తున్న బన్నీ.. సినిమాపై అంచనాల్ని పెంచుతున్నారు.

10:48 November 19

టాప్​న్యూస్​@ 11AM

  • ప్రజల అధికారం గొప్పది

నూతన వ్యవసాయ చట్టాల రద్దుచేస్తున్నట్లు ప్రధాని మోదీ(PM Modi about Farm laws repeal) ప్రకటనపై మంత్రి కేటీఆర్(ktr about Farm laws repeal) స్పందించారు. పదవుల్లో ఉన్నవారి కంటే ప్రజల అధికారం గొప్పదని ట్వీట్(ktr tweet) చేశారు. అవిశ్రాంత పోరాటంతో రైతులు మరోమారు తమ శక్తిని చాటారని కొనియాడారు.

  • నామినేటెడ్ ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

గవర్నర్ కోటా(governor quota mlc post)లో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ సభాపతి మధుసూదనాచారి(MLC Madhusudanachari) నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(telangana governor tamilisai) ఆమోదించారు. సర్క్యులేషన్ పద్ధతిన మంత్రివర్గం ఆమోదించింది. 

  • ఆందోళనలు కొనసాగుతాయి

సాగు చట్టాలను పార్లమెంట్​లో రద్దు(farm laws repealed) చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు బీకేయూ నేత రాకేశ్​ టికాయిత్​. కనీస మద్దతు ధర సహా ఇతర అంశాలపై రైతులతో ప్రభుత్వం మాట్లాడాలని డిమాండ్​ చేశారు.

  • ఇప్పట్లో వదిలే ప్రసక్తేలేదు

డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టు..​ టీ20 ప్రపంచకప్​లో పేలవ ప్రదర్శన చేసింది. సెమీస్​ కూడా చేరకుండానే వెనుదిరిగింది. అయితే ఈ మెగా టోర్నీలో భాగంగా స్టార్ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో(bravo retirement) అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు. 

  • తప్పుకున్న టిమ్ పైన్

ఆస్ట్రేలియా టెస్టు సారథి టిమ్ పైన్ టెస్టు కెప్టెన్​గా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. గతంలో మహిళా సహోద్యోగితో అసభ్య ప్రవర్తన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

09:53 November 19

టాప్​న్యూస్​@ 10AM

  •  వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం

గురునానక్​ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 

  • వెలుగులీనుతున్న తెలంగాణం

కార్తిక దీపాలతో తెలంగాణ రాష్ట్రం కాంతులీనుతోంది. కార్తిక పౌర్ణమి(karthika pournami 2021) వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయాలు సందడిగా మారాయి. పున్నమి వెన్నెల్లో అడపడుచులు.. దీపారాధన చేస్తూ ఆ పరమేశ్వరునికి మొక్కులు చెల్లించుకున్నారు.

  • భారత్‌పై అమెరికా కాట్సా అస్త్రం..!

రష్యా నుంచి ఎస్​-400 ఆయుధ వ్యవస్థను కొనుగోలు చేసినందుకు భారత్​పై ఆంక్షలు విధించే అంశంపై పరిశీలిస్తోంది అమెరికా. అయితే.. తమ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నందుకు భారత్​పై కొరడా ఝళిపించాల్సిందేనని కొందరు అమెరికన్లు చెబుతుండాగ.. వ్యూహాత్మక అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత్‌కు మినహాయింపు ఇవ్వాలని మరికొందరు వాదిస్తున్నారు.

  • టీఎస్​ఆర్టీసీ కీలక నిర్ణయం

రాత్రివేళల్లో బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు(bus journey) అత్యవసరాలకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నట్లు ఓ మహిళా ప్రయాణికురాలు ఆర్టీసీ అధికారుల(TSRTC latest news) దృష్టికి తీసుకువచ్చింది. ఆమె వినతిని స్వీకరించిన ఆర్టీసీ యాజమాన్యం.. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు రోడ్డు వెంట ఉండే దాబాలు, మంచి హోటళ్లను గుర్తించి మహిళలు తమ అత్యవరాలను వినియోగించుకోవడానికి బస్సును కొద్దిసేపు ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాంతాలు మహిళలకు సురక్షితమైనవిగా ఉండాలని పేర్కొంది.

  • తగ్గిన పసిడి ధర..ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర (Silver price today) మాత్రం రూ.400కు పైగా దిగొచ్చింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి.
 
08:52 November 19

టాప్​న్యూస్​@ 9AM

  • కేసీఆర్‌ సతీమణి శోభకు వైద్యపరీక్షలు

కరోనా(post covid complications) నుంచి కోలుకున్న తర్వాత చాలా మందిలో అనారోగ్య సమస్యలు పీడిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి(cm kcr wife) కూడా కొవిడ్ బాధితురాలే. మహమ్మారి నుంచి కోలుకున్న ఆమె ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ సతీమణి శోభకు ఇవాళ దిల్లీలో వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.

  • కాంతులీనిన హరిద్వార్

దేశవ్యాప్తంగా కార్తిక పౌర్ణమి వేడుకలు (Kartik purnima 2021) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని హర్​ కీ పౌడీ ఘాట్​లో ఒకేచోట 11 వేల దీపాలు వెలిగించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

  • 'గేమింగ్' ఉజ్జ్వల భవిత!

చలనచిత్ర పరిశ్రమతోపాటు వెబ్‌సైట్లు, యాప్‌ల రూపకల్పన, గేమింగ్‌ తదితర విభాగాలకూ వీఎఫ్‌ఎక్స్‌ సేవలు అవసరం. ఆత్మనిర్భరత లక్ష్యసాధన కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన 'భారత్‌లో తయారీ', 'డిజిటల్‌ ఇండియా' కార్యక్రమాలు భారత్‌లో వీఎఫ్‌ఎక్స్‌ రంగం వృద్ధికి గొప్ప ఊతమిస్తున్నాయి. ఈ క్రమంలో.. హైదరాబాద్ వేదికగా పెద్దఎత్తున విస్తరించిన గేమింగ్‌ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలివ్వాల్సిన అవసరం ఉంది.

  • అందంతో మైమరపించే మనిక

భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా 1995లో జన్మించింది. టోక్యో ఒలింపిక్స్​ నేపథ్యంలో ఆమె టేబుల్​ టెన్నిస్​ జాతీయ కోచ్​ సౌమ్యదీప్​ రాయ్​పై పలు ఆరోపణలు చేసి ఇటీవల వార్తల్లో నిలిచింది.

  • ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ఎన్టీఆర్

బాబాయ్ బాలయ్య 'అఖండ'(akhanda release date) కోసం అబ్బాయ్ ఎన్టీఆర్(ntr movies) అతిథిగా రానున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చల్లో ఉన్నప్పటికీ త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

07:36 November 19

టాప్​న్యూస్​@ 8AM

  • దీపారాధన ఎందుకు చేయాలంటే?

మాసాల పేర్లకు ఒక ప్రత్యేకత ఉంది. పౌర్ణమితో కలిసిన నక్షత్రమే మాసానికి పేరు అవుతుంది. కృత్తిక నక్షత్రం కలిసిన పౌర్ణమి- కార్తిక పౌర్ణమి(karthika pournami 2021). శివుడు పంచభూతాత్మక స్వరూపుడు. ఆయా భూతాల అధినాథుడిగా ఆయన వివిధ క్షేత్రాల్లో పూజలందుకుంటున్నాడు. 

  • ఆ రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు

తమిళనాడులో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడులో ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించగా.. అటు కర్ణాటక, పుదుచ్చేరిలోనూ స్కూళ్లు మూసివేశారు.

  • 'స్థానిక' ఎన్నికలకు రెండు కమిటీలు

స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల(telangana MLC elections 2021) నేపథ్యంలో రెండు కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్(telangana state CEO shashank goel) ఉత్తర్వులు జారీ చేశారు. చెల్లింపు కథనాలు, ప్రకటనల పర్యవేక్షను వేర్వేరుగా కమిటీలు నియమించారు.

  • నేటి నుంచే ఐఎస్‌ఎల్‌

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)(ISL 2021-22) ప్రారంభానికి వేళైంది. 2021-22 సీజన్‌కు శుక్రవారమే మొదలుకానుంది. ఏటీకే మోహన్‌ బగాన్‌, కేరళ బ్లాస్టర్స్‌ మధ్య తొలి మ్యాచ్​ జరుగుతుంది.

  • నా దృష్టిలో అదే పెద్ద రిస్క్

టాలీవుడ్​లోని యువహీరోలు.. ప్రతి సినిమాకూ ప్రయోగం చేయక తప్పదని తేజ అన్నారు. ఓటీటీలో విడుదలైన 'అద్భుతం'తో ప్రేక్షకులను పలకరించాడు తేజ.

06:59 November 19

టాప్​న్యూస్​@ 7AM

  • తీరం దాటనున్న వాయుగుండం..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతున్నట్టు భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. నేడు చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంలో ఏపీలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు(heavy rains) కురిసే అవకాశం ఉందన్నారు.

  • జై భీమ్ సినిమాకు అవార్డులు బంద్!

సూర్య నటించిన జై భీమ్ సినిమాకు ఎలాంటి అవార్డులు ఇవ్వకూడదని వన్నియార్ సంఘం (jai bhim vanniyar) డిమాండ్ చేసింది. ప్రశంసలకు గానీ, గుర్తింపులకు గానీ ఆ సినిమాను (jai bhim controversy) పరిగణలోకి తీసుకోకూడదని పేర్కొంది. ఈ మేరకు కేంద్రం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్ ఇచ్చింది.

  • ఆరోగ్య జీవనానికి స్వచ్ఛతే భద్రత

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌ఓ), యునిసెఫ్‌ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 360కోట్ల మంది ప్రజలు సురక్షితమైన పారిశుద్ధ్య సౌకర్యాలకు నోచుకోవడం లేదు. నేటికి సుమారు 49.4కోట్ల మంది బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేస్తున్నారు. గత రెండు దశాబ్దాల్లో సుమారు 240 కోట్ల మంది మరుగుదొడ్డి(World toilet day) సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ మూడింట రెండు వంతుల జనాభాకు ప్రాథమిక పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం.

  • 'ద్రవిడ్ ఓకే చెప్పడం ఆశ్చర్యమే'

టీమ్​ఇండియా హెడ్​ కోచ్​ పదవికి రాహుల్ ద్రవిడ్(rahul dravid coach) అంగీకారం తెలపడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(ricky ponting news). తనకు కూడా చీఫ్​ కోచ్​ పదవి కోసం​ ఆఫర్​ వచ్చినట్లు పేర్కొన్నాడు.

  • దాని గురించి ఆలోచించను

'దృశ్యం 2'తో(drishyam 2 telugu release date) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విక్టరీ వెంకటేశ్(venkatesh movies).. సినిమా సంగతులతో పాటు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తర్వాతి ప్రాజెక్టుల గురించి కూడా చెప్పారు.

04:10 November 19

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

  • ఇది అంతం కాదు.. ఆరంభం..

యాసంగిలో వరి వేయాలని చెబుతారా?రైతులకు తప్పు చెప్పామని ముక్కు నేలకు రాస్తారా? వారిని బతకనిస్తారా? లేదా? కేంద్రం ధాన్యం తీసుకోకపోతే.. ఊరూరా చావుడప్పు మోగిస్తాం. పండించిన వడ్లను దిష్టితీసి భాజపా కార్యాలయంపై కుమ్మరిస్తాం. తెలంగాణ రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేయాలని, వారి ప్రయోజనాలను రక్షించుకోవాలని మేం సమరానికి సిద్ధమయ్యాం. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. అవసరమయితే దిల్లీ యాత్ర చేస్తాం. మేం యుద్ధం ప్రారంభిస్తే చివరిదాకా కొట్లాడుతాం. దేనికీ భయపడం. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు కాపాడుకుంటాం. వారికి అండగా ఉంటాం. కేంద్రం దిగొచ్చేవరకు ధర్నాలు చేస్తామని.. మహాధర్నాలో సీఎం కేసీఆర్​ ప్రసంగించారు.

  • నేటి నుంచి కల్లాల్లోకి కాంగ్రెస్​..

రైతు సంక్షేమమే లక్ష్యంగా కల్లాల్లోకి కాంగ్రెస్(kallalloki congress program) నినాదంతో క్షేత్రస్థాయి పర్యటనలకు నేతలు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజా కొనాలనే(paddy procurement in telangana) డిమాండ్‌తో హస్తం నేతలు ఇవాళ్టి నుంచి 23వ తేదీ వరకు పర్యటించనున్నారు. జిల్లాల వారీగా ఇంఛార్జీలను నియమించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(revanth reddy tpcc news)... ఇవాళ జహీరాబాద్‌లో పర్యటిస్తారు. 23వ తేదీ లోపు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు(paddy procurement in telangana )పై స్పష్టమైన ప్రకటన చేయకుంటే... ప్రగతిభవన్ ముట్టడిస్తామని రేవంత్ పేర్కొన్నారు.

  • మున్సిపాలిటీ పాలకవర్గాలకు తీపికబురు..

మున్సిపాలిటీ పాలకవర్గం వేతనాలు(municipal council members salary) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మేయర్‌, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్​ల గౌరవ వేతనాలతో పాటు.. వైస్​ఛైర్మన్​లు, వార్డు సభ్యుల గౌరవ వేతనాలు సైతం పెంచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • వైన్​షాపుల దరఖాస్తులతో కోట్లు..

కొత్త మద్యం దుకాణాల(new liquor shops in telangana 2021) ఏర్పాటు కోసం భారీగా దరఖాస్తులు(application for liquor license) వచ్చాయి. 2,620 మద్యం దుకాణాలకు గానూ.. 66,452 దరఖాస్తులు(application for liquor license) వచ్చాయి. ఈ దరఖాస్తుల ద్వారా రూ.1329 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.

  • కార్తికపౌర్ణమి పూజల్లో కవిత..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kavitha) ఇంట కార్తీక పౌర్ణమి(Karthika Pournami) శోభ నెలకొంది. కార్తీక పౌర్ణమి(Karthika Pournami) సందర్భంగా కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్​లోని తన ఇంట్లో.. కుటుంబ సభ్యులతో కలిసి కవిత పూజా కార్యక్రమంలో పాల్గొన్నా. తులసి కోట వద్ద దీపాలు వెలిగించి.. హారతులు పట్టారు.

  • కుండపోత వర్షాలతో తిరుమల అతలాకుతలం..

కుండపోత వర్షంతో ఏపీలోని తిరుమల ఆలయ పరిసరాలు నీట మునిగాయి. కనుమదారుల్లో వరద నీరు జలపాతాలను తలపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిపివేశారు. ఇప్పటికే కొండపైన ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • గంజాయి సరఫరాపై ప్రధానికి లేఖ..

అమెజాన్​లో గంజాయి అక్రమ సరఫరాపై భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​)తో విచారణ జరిపించాలని లేఖలో కోరింది.

  • 2022 ఏప్రిల్​ నాటికి భారత్​కు రఫేల్​..

2022 ఏప్రిల్ నాటికి భారత్​కు అందించాల్సిన (Rafale jets latest news) మిగిలిన ఆరు రఫేల్​ యుద్ధ విమానాలను కూడా అప్పగిస్తామని ఫ్రాన్స్​ రాయబారి ఇమ్మాన్యుయేల్​ లెనైన్​ తెలిపారు.​ ఒప్పందంలో భాగంగా 36 విమానాలు అందించాల్సి ఉండగా.. ఇప్పటివరుకు 30 విమానాలు భారత్​కు చేరాయి.

  • భారత్​కు సిరీస్​ దక్కేనా..​ 

న్యూజిలాండ్‌తో ట్వంటీ-20 సిరీస్‌పై.. భారత్‌ జట్టు (India vs New Zealand) కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన రోహిత్‌ సేన.. శుక్రవారం జరిగే రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో మిడిలార్డర్‌ తడబడగా.. రెండో టీ-20లో ఆ సమస్యను అధిగమించాలని యోచిస్తోంది. అటు రెండో మ్యాచ్‌లోనైనా గెలిచి, సిరీస్‌ సమం చేయాలని కివీస్‌ ఆరాటపడుతోంది.

  • హ్యాపీ బర్త్​డే షకలకబేబీ..

హీరోయిన్ సుస్మితాసేన్.. మిస్​ యూనివర్స్​ నుంచి హీరోయిన్​గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తోంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం..

Last Updated : Nov 19, 2021, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.