ETV Bharat / city

'శాకాహారుల్లో కరోనా ప్రభావం తక్కువ'

కరోనా వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవేనని.... సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్రా తెలిపారు. సుదీర్ఘ పరిశోధనలు, క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాల తర్వాతే వాటికి అనుమతులు వచ్చాయని వెల్లడించారు. యూకేస్ట్రెయిన్ గురించి ఆందోళన వద్దన్న ఆయన... కొవిడ్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. సీసీఎంబీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేసిన పరిశోధనల్లో శాకాహారం తీసుకునే వారిలో తక్కువ మంది కరోనా బారినపడుతున్నట్టు ప్రాథమిక గుర్తించామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత పరిశోధనలు చేయాల్సి ఉంటుందంటున్న.. రాకేశ్ మిశ్రాతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి.

etv bharat face to face interview with ccmb director rakesh  K mishra
సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రాతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి
author img

By

Published : Jan 30, 2021, 8:05 AM IST

Updated : Jan 30, 2021, 8:15 AM IST

సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రాతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి

ప్రశ్న: శాఖాహారులు, పొగతాగే వారిలో కరోనా వ్యాప్తి తక్కువ అన్నట్లుగా చెబుతున్నారు. శాకాహారులపై కరోనా వ్యాప్తి ప్రభావం ఉందా లేదా? అధ్యయనాల్లో ఏం తేలింది?

మిశ్రా: సీఎస్‌ఐఆర్‌ అధ్యయనం దీర్ఘకాలిక ప్రాజెక్టు. దేశవ్యాప్తంగా సీఎస్‌ఐఆర్‌ ఉద్యోగుల్లో సీరో సర్వే ద్వారా పాజిటివిటి రేటును తెలుసుకుంటున్నాం. శాకాహారులు, పొగ తాగే వారిలో యాంటీబాడీస్‌ అధికంగా ఉన్నట్లు గుర్తించాం. ఐతే, ఈ అంశంలో అవగాహనకు రావడానికి ఇదేమీ పూర్తి స్థాయి అధ్యయన నివేదిక కాదు. మీరు వెంటనే ధుమపానం ప్రారంభించమని ప్రజలకు సందేశమేమి ఇవ్వడం లేదు. సీరో పాజిటివిటి విషయంలో స్పష్టత కోసం మరింత సమాచారం, మరిన్ని విశ్లేషణలు చేయాల్సిన అవసరముంది. అప్పుడే ఈ అంశంపై స్పష్టత ఇవ్వగలం.

ప్రశ్న: ఈ అంశంపై ఎన్ని రోజుల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. నమూనా పరిమాణం ఎంత?

మిశ్రా: నమూనా పరిమాణం ఏడెనిమిది వేల మంది ఉన్నారు. ఐతే, భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు ఐదారు నెలల క్రితమే ప్రారంభమైందనుకుంటున్నాను. చాలా కేసుల్లో రెండు విడతల సీరో సర్వే విజయవంతంగా పూర్తయింది. ఈ అధ్యయనం దీర్ఘకాలికంగా ఉంటుంది. జన్యుక్రమాలు, ఇతర వ్యాధులకు సంబంధించిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని మరిన్ని వివరాలు వెలుగులోకి తెచ్చేందుకు సుమారు 10 నుంచి 15ఏళ్లు పట్టొచ్చు.

ప్రశ్న: మీరు హైదరాబాద్‌ ప్రజలపై పరిశోధన చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా మీరు గుర్తించిన అంశాలేవి?

మిశ్రా: సర్వే నమూనాలను జాతీయ పోషకాహార సంస్థ సహకారంతో పూర్తి చేశాం. హైదరాబాద్‌ వేదికగా నిర్వహించిన ఈ సర్వేలో సీరో ప్రొవిలెన్స్‌ గురించి అడిగాం. ప్రజలు కరోనా బారిన పడ్డారా? లేదా? ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారా? ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారా? వైరస్‌ లక్షణాలు కనిపించాయా? లేదా? అనే అంశాలపై సీరో ప్రొవిలెన్స్‌లో తెలుసుకున్నాం. కానీ, చాలా మందిలో యాంటీబాడీస్‌ కనిపించాయి. ఈ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లో రోగనిరోధకత ఏమేరకు ఉన్నదనే విషయం మాకు తెలిసింది. తద్వారా ఎంత వరకు వ్యాక్సినేషన్ అవసరముందనే అంశంపై స్పష్టత వచ్చింది.

ప్రశ్న: యూకే స్ట్రెయిన్, భారత్‌లోనూ స్ట్రెయిన్ విభిన్న రకాలుగా రూపాంతరం చెందింది. ఇదే విషయాన్ని ఇటీవల సీసీఎంబీ సైతం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని భిన్న రకాల స్ట్రెయిన్ వైరస్‌ల గురించి వివరించగలరా?

మిశ్రా: వైరస్‌ అత్యంత వేగంగా పరిణామం చెందుతోంది. కొన్ని సందర్భాల్లో సహజంగానే కొత్త రకం వైరస్‌లు పుట్టుకొస్తాయి. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల నమూనాలను నిశితంగా అధ్యయనం చేసి జన్యుక్రమాలను విశ్లేషించి.. అది కొత్త రకమా? కాదా? అనే విషయం తెలుస్తుంది. కొత్త రకంతో మరి అంతగా భయాపడాల్సిన అవసరం లేదు. తూర్పు, దక్షిణాసియా, ముఖ్యంగా భారత్‌లో... ఇటీవల గుర్తించిన కొత్తరకం వైరస్‌ల ప్రభావం చాలా తక్కువగా ఉంది. కానీ, గత కొన్ని నెలలుగా ఐరోపా దేశాలు, ముఖ్యంగా బ్రిటన్‌లో ఈ కొత్త రకం వైరస్‌ చాలా ప్రభావం చూపుతోంది. లక్షణాల్లో పెద్దగా తేడాల్లేవు. మరణాల్లో వ్యత్యాసాల్లేవు. కానీ బాధితుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఆస్పత్రులపై భారం పెరిగింది. వైద్యులపై ఒత్తిడి నెలకొంది. అందువల్లే యూకే అత్యంత ఎక్కవ ప్రభావితమైన దేశంగా మారిపోయింది. ఐతే, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఇప్పుడు వచ్చిన కరోనా వ్యాక్సిన్లు కొత్త రకాన్ని జయిస్తాయా? లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేనందు వల్ల వైరస్‌ వ్యాప్తి నిరోధానికి మనం సాధ్యమైనంత వరకు కృషి చేయాలి. ఇటీవల మా అధ్యయనల్లో ఓ కొత్త రకం వైరస్‌ను గుర్తించాం. దాన్ని ఎన్‌440కేగా పిలుస్తున్నాం. ఇవి దక్షిణ భారత్‌ నుంచి వచ్చిన కేసుల్లో ఇది ప్రాథమిక దశలో ఒకట్రెండు శాతమే ఉంది. కానీ ఇప్పడు 40, 50శాతం బయటపడుతున్నాయి. ఐతే, ఆస్పత్రుల రికార్డుల ప్రకారం ఈ కేసుల్లోనూ వ్యాప్తి, మరణాలు తక్కువగానే ఉన్నాయి.

ప్రశ్న: వ్యాక్సిన్‌ పట్ల కొంతమందిలో ఆందోళన నెలకొంది. నిజంగా టీకా అంత హానికరమా?

మిశ్రా: లేదు. సమాచార లోపంతోనే ఇలా జరుగుతోందని భావిస్తున్నాను. సుమారు 20లక్షల మందికిపైగా ఇప్పటివరకు టీకా వేయించుకున్నారు. ఎవరికి ఏమి కాలేదు. ఒకట్రెండు ఘటనలు జరిగినా... వాటికి ఇతర కారణాలున్నాయి. కొందరికి దీర్ఘకాలిక వ్యాధులుండటం వల్ల అలా జరిగి ఉండవచ్చు. కానీ, మనకు అందుబాటులో ఉన్న పక్కా సమాచారం, మొదటి, రెండో విడతల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా చూస్తే టీకా చాలా సురక్షితమైనది. ఐతే, అది వైరస్‌ నుంచి మనల్ని ఎప్పటివరకు, ఎంతకాలం రక్షిస్తుందనేది కాలమే చెబుతుంది. ప్రజలు మాస్కు తప్పక ధరించాలి. మనం ఈ యుద్ధంలో తప్పక గెలుస్తాం.. ఇప్పటికే మంచిస్థాయిలో ఉన్నాం.

ప్రశ్న: వచ్చే నెల నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఏరకమైన జాగ్రత్తలు తీసుకోవాలి?

మిశ్రా: విద్యార్థులు కచ్చితంగా మాస్కులు ధరించాలి. ఎవరితోనూ అతి దగ్గరగా ఉండకూడదు. ఆటల్లోనూ దూరం పాటించాలి. వాహనాల్లో పిల్లలకు వైరస్‌ సోకితే వారికేమి కాకపోయినా.. ఇంట్లో తల్లిదండ్రులు, వృద్ధులకు నష్టం కలగొచ్చు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఇవీ చూడండి: మహమ్మారిపై ముప్పేట దాడి!- దేశంలో కొవిడ్‌కు ఏడాది

Last Updated : Jan 30, 2021, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.