ETV Bharat / city

ఈఎస్‌ఐ స్కాం: ఔషధాల ధర పెంచేందుకే డొల్ల కంపెనీలు - esi scam update on babji

కార్మిక బీమా సంస్థలో అక్రమాలు రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఓమ్నిమెడీ సంస్థ ఎండీ శ్రీహరిబాబు ఔషధాల ధరలు పెంచేందుకే పలు సంస్థలు సృష్టించినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది.

ఈఎస్‌ఐ స్కాం: ఔషదాల ధర పెంచేందుకే డొల్ల కంపెనీలు
ఈఎస్‌ఐ స్కాం: ఔషదాల ధర పెంచేందుకే డొల్ల కంపెనీలు
author img

By

Published : Jan 24, 2020, 5:01 AM IST

Updated : Jan 24, 2020, 7:36 AM IST

ఈఎస్‌ఐ కుంభకోణంలో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఐఎంఎస్ నిధులను అడ్డగోలుగా దోచుకోవడంలో ఆరితేరిన ఓమ్నీమేడీ కంజర్ల శ్రీహరిబాబు అలియాస్ బాజ్జీ లీలలు ఏసీబీ అధికారులకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఔషధాల ధర పెంచుకోవడం కోసమే డొల్ల కంపెనీలు సృష్టించినట్లు ఏసీబీ దర్యాప్తులో బహిర్గతమైంది. స్వీడన్‌కు చెందిన హీమెక్యూ అనే కంపెనీ ఔషదాలను కొనుగోలు చేసేందుకు లెజెండ్ అనే సంస్థకు కట్టబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. డీలర్‌షిప్ ప్రకారం హిమెక్యూ సంస్థ నుంచి ఔషధాలు నేరుగా లెజెండ్ సంస్థకే సరఫరా కావాల్సి ఉంది. కానీ మధ్యలో మరో మూడు సంస్థలు చేతులు మారినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.

లెజెండ్ సంస్థ ఎండీ కృష్ణసాగర్ రెడ్డిని విచారిస్తున్న సమయంలో ఏసీబీ ఈ ఔషధాల కుట్రను బహిర్గతం చేసింది. చివరగా లెజెండ్ సంస్థ నుంచి అక్రమ నిధుల్ని తిరిగి బాజ్జీ ఖాతాలోకి మళ్లించినట్లు గుర్తించారు. ఇలా కొల్లగొట్టిన నిధులతో బాజ్జీ తనతో పాటు తన భార్య పేరుమీద రూ.150 కోట్ల విలువ చేసే షేర్లు, ఎఫ్‌డీలు తీసుకున్నట్లు గుర్తించారు. ఆ లావాదేవీలను అధికారులు స్తంభింపజేశారు. కేవలం ఔషధాల ధర పెంచేందుకే ఈ పన్నాగం పన్నినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది.

ఈఎస్‌ఐ స్కాం: ఔషదాల ధర పెంచేందుకే డొల్ల కంపెనీలు

ఇవీ చూడండి:దావోస్​లో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం

TG_HYD_03_24_ESI_SCAAM_DRY_3182388 reporter : sripathi.srinivas ( ) భీమా వైద్య సేవల విభాగం కుంభకోణంలో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఐఎంఎస్ నిధులను అడ్డగోలుగా దోచుకోవడంలో ఆరితేరిన ఓమ్నీమేడీ కంజర్ల శ్రీహరిబాబు అలియాస్ బాజ్జీ లీలలు ఆశ్చర్యం కల్గిస్తున్నాయి. ఔషదాల ధర పెంచుకోవడం కోసమే డొల్ల కంపెనీలు సృష్టించినట్లు ఏసీబీ దర్యాప్తులో బహిర్గతమైంది. స్పీడన్ కు చెందిన హీమేక్యూ అనే కంపెనీకి చెందిన ఔషదాలను కొనుగోలు చేసేందుకు లెజెండ్ అనే సంస్థకు కట్టబెట్టిన తీరు బాగోతం విస్తు గలిపేలా ఏసీబీ గుర్తించింది. డీలర్ షిప్ ప్రకారం హిమెక్యూ సంస్థ నుంచి ఔషదాలు నేరుగా లెజెండ్ సంస్థకే సరఫరా కావాల్సి ఉంది. కానీ..మద్యలో మరో మూడు సంస్థలు చేతులు మారినట్లు ఏసిబీ దర్యాప్తులో తేలింది. అసలు కారణం తెలిసి దర్యాప్తు అధికారులే ఆశ్చర్యపోయారు. లెజండ్ సంస్థ ఎండీ కృష్ణసాగర్ రెడ్డిని విచారిస్తున్న సమయంలో ఏసీబీ ఈ ఔషదాల కుట్రను బహిర్గతం చేసింది. చివరగా లెజండ్ సంస్థ నుంచి అక్రమ నిధుల్ని తిరిగి బాజ్జీ ఖాతాలోకి మళ్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇలా కొల్లగొట్టిన నిధులతోనే బాజ్జీ తనతో పాటు తన భార్య పేరుమీద 150 కోట్ల విలువ చేసే షేర్లు, ఎఫ్.డీలు తీసుకున్నట్లు గుర్తించి వాటి లావాదేవీలను ఏసీబీ అధికారులు స్థంబింపజేశారు. కేవలం ఔషదాల ధర పెంచేందుకే ఈ పన్నాగం పన్నినట్లు ఏసీబీ అధికారులు విచారణలో తేలింది.
Last Updated : Jan 24, 2020, 7:36 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.