ఏపీలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 74,435 మంది పరీక్ష ఫలితాలు రాగా.. కొత్తగా 11,434 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 10,54,875 కు చేరింది. నేడు మరో 64 మంది వైరస్ బారిన పడి మరణించగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,800కు పెరిగింది. నేడు కరోనాతో విజయనగరం జిల్లాలో అత్యధికంగా 8 మంది మృతి చెందగా.. అనంతపురం, తూర్పుగోదావరి , గుంటూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున మరణించారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు.. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
ఆ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మరో 7,055 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 9,47,629కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 99,446 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
జిల్లాల వారీగా కేసులు
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 2028, చిత్తూరు జిల్లాలో 1982 కొత్త కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 1322, నెల్లూరు జిల్లాలో1237 , విశాఖ జిల్లాలో 1067 కరోనా కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదన్న మంత్రి ఈటల రాజేందర్