ETV Bharat / city

'హైదరాబాద్​ విశ్వనగరంగా మారాలంటే రోడ్ల విస్తరణ జరగాలి' - కిషన్​రెడ్డి వార్తలు

హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందాలంటే రోడ్ల విస్తరణ కీలకమని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సమన్వయంతో ముందుకెళ్లాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్​ఆర్డీపీ కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న రూ.426 కోట్ల అభివృద్ధి పనులకు ఇందిరాపార్క్ వద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​తో కలిసి శంకుస్థాపన చేశారు. రోడ్ల అభివృద్ధి విషయంలో కేంద్రంతో కలిసి ముందుకెళ్తామని కేటీఆర్​ స్పష్టం చేశారు.

'హైదరాబాద్​ విశ్వనగరంగా మారాలంటే రోడ్ల విస్తరణ జరగాలి'

author img

By

Published : Jul 11, 2020, 12:51 PM IST

Updated : Jul 11, 2020, 5:13 PM IST

కొవిడ్ - 19 నేపథ్యంలో లాక్​డౌన్​ను అమలు చేసిన సమయంలో 4రేట్ల వేగంతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రూ.426 కోట్ల‌తో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్‌, ఫ్లైఓవ‌ర్​కు సంబంధించిన వివరాలను మంత్రి వెల్లడించారు. రూ. 350 కోట్ల‌తో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ మొద‌టి ద‌శలో నిర్మించ‌నున్న‌ నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జికి.. రూ.76 కోట్ల‌తో రాంన‌గ‌ర్ నుంచి బాగ్‌లింగంప‌ల్లి పేజ్‌‌-2 సెకం‌డ్ లేవ‌ల్​లో నిర్మించ‌నున్న 3 లేన్ ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశామన్నారు. వీటిని శరవేగంగా పూర్తి చేస్తామన్నారు. వైరస్​ వ్యాప్తిస్తున్నా జీహెచ్​ఎంసీ అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారాలంటే రోడ్ల విస్తరణ చేయాల్సిందే... దానికి అందరూ సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

కేంద్రంతో కలిసి ముందుకెళ్తాం..

అంబర్​పేట ఫ్లై ఓవర్​ నిర్మాణానికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు... వీలైనంత త్వరగా వంతేనను పూర్తి చేస్తాం. కొన్ని రోడ్ల విస్తరణ పనులకు రక్షణ రంగానికి సంబంధించిన స్థలాలు అవసరమవుతాయి. కాబట్టి అందుకు కేంద్రం సహకరించాలి. 36 కిలో మీటర్ల స్కై వే నిర్మించాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తాం. - కేటీఆర్​, పురపాలక శాక మంత్రి

ట్రాఫిక్​కు చెక్​..
'హైదరాబాద్​ విశ్వనగరంగా మారాలంటే రోడ్ల విస్తరణ జరగాలి'

రోడ్ల విస్తరణతో ట్రాఫిక్​ సమస్యకు చెక్ పెట్టవచ్చని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ బెంగుళూరులో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్లనే పెట్టుబడిదారులు కాస్త ఆలోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​లో ట్రాఫిక్​ సమస్యను అదిగమించితే.. మరిన్ని పెట్టుబడులు తరలివస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: షాపింగ్ సెంటర్​లో​ భారీ అగ్ని ప్రమాదం

Last Updated : Jul 11, 2020, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.