Elephants at tirumala: తిరుమల పాపవినాశనం దారిలో రోడ్డుపై ఏనుగులు సంచరించాయి. ఏనుగులు రహదారిపైకి రావడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా పార్వేట మండపం వద్ద ఏనుగులు సంచరిస్తున్నాయి. అటవీ ప్రాంతం నుంచి వచ్చాయి. తిరుమల వైపునకు ఏనుగులు రాకుండా భద్రతా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతిలో ఇటీవల ఏనుగుల సంచారం తరచూ కనపడుతోంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను తితిదే వైభవంగా నిర్వహిస్తోంది. తెలుగు సంవత్సారాది.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. వేకువజామున స్వామివారి సుప్రభాత, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్‌ను పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో ధ్వజస్తంభం వద్దకు ప్రదక్షిణంగా వెళ్లి.. ఆలయ శుద్ధికార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఆనందనిలయం, బంగారువాకిలితోపాటు ఆలయంలోని ఉపదేవాలయాలు, పూజాసామగ్రి శుభ్రపరిచారు. స్వామివారికి ప్రత్యేక పూజలు.. నైవేద్యం సమర్పించిన అనంతరం మధ్యాహ్నం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.
ఇదీ చదవండి: జక్కన్నపై ఆలియా అలక.. ఇన్‌స్టాలో అన్‌ఫాలో!