ETV Bharat / city

ఏప్రిల్​ 17న తిరుపతి లోక్​సభకు ఉపఎన్నిక

ఏపీలోని తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్‌ 17న ఎన్నిక నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

author img

By

Published : Mar 16, 2021, 6:33 PM IST

Updated : Mar 16, 2021, 7:29 PM IST

election-commission-of-india-issued-notification-for-tirupati-by-election

ఏపీలోని తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్‌ 17న ఎన్నిక నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈనెల 23న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్‌ రావు(వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ) ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ స్థానానికి వైకాపా తరఫున డా.గురుమూర్తి బరిలోకి దిగనున్నారు. తెదేపా అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని ఇప్పటికే పార్టీ ప్రకటించింది.

  • మార్చి 30 వరకు నామినేషన్లకు గడువు
  • మార్చి 31న నామినేషన్ల పరిశీలన
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 3
  • ఏప్రిల్ 17న పోలింగ్
  • మే 2న ఫలితాలు

ఇదీ చదవండి: 'ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం... మూడు షిఫ్టుల్లో కౌంటింగ్​...'

Last Updated : Mar 16, 2021, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.