ETV Bharat / city

అలా ప్రచారం చేయడానికి వీల్లేదు.. భాజపాకు షాకిచ్చిన ఈసీ

KCR EC
KCR EC
author img

By

Published : Aug 11, 2022, 1:42 PM IST

Updated : Aug 11, 2022, 3:35 PM IST

13:38 August 11

సీఎం కేసీఆర్‌పై ప్రచారాన్ని నిలుపుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా చేపట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భాజపాను ఆదేశించింది. 'సాలు దొర‌- సెలవు దొర' ప్రచారంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి బొమ్మతో పాటు ఈ నినాదాన్ని కలిపి పోస్టర్లుగా ముద్రించడానికి అనుమతి నిరాకరించింది. 'సాలు దొర-సెలవు దొర' ప్రచారానికి అనుమతి కోరుతూ భారతీయ జనతా పార్టీ నేతలు ఎలక్షన్​ కమిషన్​ను సంప్రదించారు. ఈ దరఖాస్తును.. మీడియా సర్టిఫికేషన్ కమిటీ తిరస్కరించింది.

రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు ఉండకూడదని కమిషన్ తేల్చిచెప్పింది. 2019 ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు ఆదేశాలతో 'మీడియా సర్టిఫికేషన్ కమిటీ'ని కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పార్టీలు చేసే ప్రచారానికి సంబందించిన అన్ని విషయాలపై 'సర్టిఫికేషన్ కమిటీ' నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఒకవేళ దీన్ని ధిక్కరిస్తే.. కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు..

Last Updated : Aug 11, 2022, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.