ETV Bharat / city

Earthquake: ఆ రాష్ట్రాల్లో భారీ భూకంపం.. బెంబేలెత్తిన జనాలు - భూకంపం

జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

Earthquake
Earthquake
author img

By

Published : Oct 3, 2021, 7:39 PM IST

జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో ఈ రోజు మధ్యాహ్నం భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. మొదట జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాలో.. ఆ తర్వాత కొద్దిసేపటికే అసోంలో భూమి కంపించింది. ప్రాణభయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు.

సింగ్‌భూమ్‌లో 2గంటల 22 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదైంది. తర్వాత అసోంలో 2గంటల 40నిమిషాలకు భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.

ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: Saidharamtej health: ఆస్పత్రి నుంచి సాయిధరమ్​ తేజ్​ ట్వీట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.