ETV Bharat / city

EarthQuake in Andhra Pradesh: బంగాళాఖాతంలో భూకంపం.. ఏపీలో ప్రకంపనలు

బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. కాగా ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి 260 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

author img

By

Published : Aug 24, 2021, 3:05 PM IST

earthquake-at-few-places-in-andhra-pradesh-and-earthquake-in-the-bay-of-bengal

బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై భూకంపం తీవ్రత 5.1గా నమోదు అయినట్టు నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది.

తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలుకు 257 కిలోమీటర్ల దూరంలో ని సముద్ర గర్భంలో ఈ భూకంపం నమోదు అయినట్టు తెలియజేసింది. సముద్ర గర్భం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రకం ఉన్నట్టు ఎన్జీఆర్​ఐ పేర్కొంది.

కాకినాడ నుంచి ఆగ్నేయంగా 296 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి నుంచి 312 కిలోమీటర్ల, పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురానికి 260 కిలోమీటర్ల దూరంలోను భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది.

2 సెకన్ల పాటు భూ ప్రకంపనలు నమోదు అయినట్టు శాస్తవ్రేత్తలు వెల్లడించారు. ప్రకంపనల స్థాయి తక్కువగా ఉండటంతో ఎలాంటి సునామి హెచ్చరికలు జారీ చేయలేదు.

ఇదీ చదవండి: Kishan reddy: పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి డిసెంబర్‌ నుంచి 'దేఖో అప్‌నా దేశ్' కార్యక్రమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.