ETV Bharat / city

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​తో ఓటరు గుర్తింపు కార్డు డౌన్​లోడ్

ఓటరు గుర్తింపు కార్డును మొబైల్​ ఫోన్​ ద్వారానే డౌన్​లోడ్ చేసుకోవచ్చని జీహెచ్​ఎంసీ వెల్లడించింది. రిజిస్టర్ చేసుకున్న నంబర్​ల ద్వారా పీడీఎఫ్​ ఫార్మాట్​లో డౌన్​లోడ్ చేసి ప్రింట్​ తీసుకోవడంతో పాటు ఎపిక్​ కార్డును స్టోర్ చేసుకోవచ్చని తెలిపింది.

E-Epic program on National Voters Day by GHMC
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​తో ఓటరు గుర్తింపు కార్డు డౌన్​లోడ్
author img

By

Published : Jan 23, 2021, 7:17 PM IST

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 25న ఈ-ఎపిక్ కార్యక్రమాన్ని జీహెచ్​ఎంసీ ప్రారంభించనుంది. ఈ-ఎపిక్ నూతన విధానంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాన్ని చేపడతామని బల్దియా తెలిపింది. ఓటరు గుర్తింపు కార్డును రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ల ఆధారంగా డౌన్​లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. పీడీఎఫ్ ఫార్మాట్​లో డౌన్​లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవడమే గాక ఎపిక్​ కార్డును స్టోర్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

2021లో ప్రకటించిన స్పెషల్ సమ్మరీ రివిజన్​లో కొత్తగా నమోదైన యువ ఓటర్లు ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ముందుగా తాము రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్ ల ద్వారా ఈ-ఎపిక్ కార్డులు డౌన్ లోడ్ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులో ఉంటుందని జీహెచ్​ఎంసీ అధికారులు తెలిపారు.

ఈ-ఓటర్ హువా డిజిటల్, క్లిక్ పర్ ఎపిక్ అనే పేరుతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని ఎన్నికల అధికారులను ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ఓటర్ పోర్టల్ ttp://voterportal.eci.gov.in, NVSP:https://nsvp.in, ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ https://play.google.com/store/apps/details?id=com.eci citizen ... ఐ.ఓ.ఎస్. ద్వారానైతే http://apps.apple.com/in/app/voter-helpline/id1456535004 ల ద్వారా ఎలక్ట్రానిక్ ఓటరు గుర్తింపు కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.