ETV Bharat / city

'ఐదారేళ్లలో ఆయుధ సంపత్తిలోనూ స్వయం సమృద్ధి' - drdo news today

రక్షణ రంగంలో విశేష కృషి చేస్తున్న డీఆర్​డీఓ.. ఇటీవలి కాలంలో వైద్యరంగంలోనూ అనే పరిశోధనలతో ప్రజలకు చేరువైంది. కొవిడ్ విపత్తు వేళ వైరస్ నియంత్రణకు ఈఎస్​ఐ ఆసుపత్రితో కలిసి అనేక ప్రయోగాలు చేయటమే కాదు... కొవిడ్ బారిన పడిన వారి కోసం 2డీజీ పేరుతో థెరప్యూటిక్ మందులను సైతం అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఐదారేళ్లలో స్వదేశీ తయారీ ఆయుధ సంపత్తిలోనూ దేశం స్వయం సమృద్ధి సాధిస్తుందంటున్న డీఆర్​డీఓ ఛైర్మన్ డాక్టర్ సతీశ్​ రెడ్డితో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్యక్రిష్ణ ముఖాముఖి...

drdo chairman satish reddy special interview

author img

By

Published : Dec 22, 2020, 9:20 PM IST

'ఐదారేళ్లలో ఆయుధ సంపత్తిలోనూ దేశం స్వయం సమృద్ధి'

వైద్య పరికరాలను మరింత తక్కువ ధరలకే సాధారణ ప్రజలకు అందించాల్సిన అవసరముందని... ఆ దిశగా డీఆర్​డీఓ కృషి చేస్తోందని... ఆ సంస్థ ఛైర్మన్ సతీష్‌రెడ్డి తెలిపారు. వైద్యరంగంలో మరింత పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. ఈ దిశగా ప్రయోగాలు చేయాలనుకునే ఈఎస్​ఐ వైద్య కళాశాల విద్యార్థులు... డీఆర్​డీఓ ల్యాబ్‌లలో పనిచేసేందుకు వీలుగా ఒప్పందాలు చేయనున్నట్టు ప్రకటించారు.

దేశంలోనే మొట్టమొదటి బీఎస్​4 ల్యాబ్‌ని డీఆర్​డీఓ త్వరలో ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. డీఆర్​డీఓ తయారు చేసిన కాంక్లియార్ ఇంప్లాంట్‌ని ఇప్పటికే ఐదుగురు రోగులకు అమర్చి... వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు వివరించారు. కొవిడ్ సమయంలో ఈఎస్​ఐతో కలిసి అనేక ప్రయోగాలు చేశామన్న సతీష్‌రెడ్డి.... భవిష్యత్తులోనూ ఆ బంధాన్ని కొనసాగించనున్నట్టు వివరించారు.

ఇదీ చూడండి: 65 గంటలపాటు పెయింటింగ్​... మాస్టారు గిన్నిస్​​ రికార్డ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.