ETV Bharat / city

డీజీపీ కార్యాలయంలో 3వీ సేఫ్ టన్నెల్ - తెలంగాణ డీజీపీ తాజా వార్తలు

పోలీస్ అధికారులతో డీజీపీ మహేందర్​రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ అనంతరం పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి తగు ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉందన్నారు. విధి నిర్వహణలో భాగంగా మానవీయ కోణంలో, సమాజ భద్రత, రాష్ట్ర పురోభివృద్ధికై నిర్విరామంగా కృషి చేస్తోన్న వారికి పోలీస్​ బాస్​ కృతజ్ఞతలు తెలిపారు.

3v safe tunnel
3v safe tunnel
author img

By

Published : Apr 5, 2020, 6:05 AM IST

Updated : Apr 5, 2020, 10:33 AM IST

లాక్​డౌన్ సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ పని తీరుపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. లాక్ డౌన్ అనంతరం పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి తగు ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉందన్నారు. విధి నిర్వహణలో భాగంగా మానవీయ కోణంలో, సమాజ భద్రత, రాష్ట్ర పురోభివృద్ధికై నిర్విరామంగా కృషి చేస్తోన్న వారికి పోలీస్​ బాస్​ కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత జాగ్రత్తలు, లాక్​డౌన్ మరింత సమర్థవంతంగా అమలు, విధినిర్వహణలో ఉన్న పోలీసులకు శాఖాపరంగా చేపట్టిన సదుపాయాల గురించి మహేందర్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి..

దాదాపు మూడు వేల మంది పోలీస్ అధికారులతో డీజీపీ మహేందర్​రెడ్డి టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విధి నిర్వహణలో వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు, భద్రత అత్యంత ప్రధానమన్నారు. పోలీస్ అధికారులందరికీ వైరస్ నిరోధక పరికరాలన్నీ సమకూర్చనున్నట్లు ప్రకటించారు. కరోనా నివారణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అన్నారు. లాక్​డౌన్​ను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

3వీ సేఫ్‌ టన్నెల్‌..

పలు రకాల సూక్ష్మక్రిములను నివారించే 3వీ సేఫ్‌ టన్నెల్‌ను డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. 1.5 మైక్రాన్‌ల నుంచి 20 మైక్రాన్‌ల వరకు ఉండే సూక్ష్మక్రిములను ఈ టన్నెల్‌ గుర్తించి నాశనం చేస్తుంది. వాస్కులర్‌ టెక్నాలజీస్‌ ఏర్పాటు చేసిన ఈ టన్నెల్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి, సీనియర్‌ పోలీస్‌ అధికారులు పరిశీలించారు. ఈ టన్నెల్‌ నుంచి సురక్షిత రసాయనాలతో కూడిన తుంపర్లు వెలువడుతుంటాయి. వీటిలో నుంచి 20 సెకన్ల పాటు వెళ్తే అన్ని రకాల ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయని వాస్కులర్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులు వివరించారు.

రాజధానిలో కర్ఫ్యూ..

భాగ్యనగరంలో రాత్రి కర్ఫ్యూను పోలీసులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. అసెంబ్లీ, కోఠి, మైత్రీవనం తదితర ప్రాంతాలల్లో భారీ గేడ్లు వేసి.. విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా.. వారి వివరాలను అడిగి తెలుసుకున్న తర్వాతనే వారిని పంపించారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉన్నందున.. రాత్రి రోడ్లన్ని నిర్మానుషంగా మారాయి.

డీజీపీ కార్యాలయంలో 3వీ సేఫ్ టన్నెల్

ఇవీ చూడండి: లైట్స్​ ఆపితే పవర్​ గ్రిడ్​పై ప్రభావం పడుతుందా?

Last Updated : Apr 5, 2020, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.