ETV Bharat / city

కొత్త రెవెన్యూ చట్టం అమల్లో జాప్యం.. ఇబ్బందుల్లో రైతులు - Dharani portal in telangana

రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం అమలుకు సంబంధించి మార్గదర్శకాల జారీలో జాప్యం చోటుచేసుకోవడం వల్ల క్షేత్రస్థాయిలో అందించాల్సిన సేవల్లో స్తబ్ధత నెలకొంది. శాసనసభలో ఈ చట్టం ఆమోదం, గెజిట్ విడుదల అనంతరం ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడం వల్ల రైతులు, భూయజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

delay-in-implementation-of-new-revenue-act-in-telangana
కొత్త రెవెన్యూ చట్టం అమల్లో జాప్యం
author img

By

Published : Dec 19, 2020, 7:11 AM IST

కొత్త రెవెన్యూ చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాల జారీలో జాప్యం చోటుచేసుకుంటోంది. క్షేత్రస్థాయిలో అందించాల్సిన సేవలు, విధుల పట్ల తహసీల్దార్లలో స్తబ్ధత నెలకొంది. ప్రభుత్వం గత అక్టోబరులో పాత ఆర్‌వోఆర్‌ చట్టాన్ని రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా ధరణి పోర్టల్‌ ద్వారా డిజిటల్‌ సేవలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, వారసత్వ బదిలీ, భాగపంపిణీ, బహుమతి, వ్యవసాయ భూములను వ్యవసాయేతర రంగాలకు మార్పిడి(నాలా)కి అనుమతి తదితర సేవలు అందుబాటులోకి వచ్చాయి.

శాసనసభలో చట్టం ఆమోదం, గజిట్‌ విడుదల అనంతరం ప్రభుత్వం మార్గదర్శకాల విడుదల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేదు. నవంబరు 2వ తేదీ నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా కొన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు తహసీల్దార్లకు సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌ హోదా కల్పించి రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తహసీల్దార్లు ఏయే సేవలు అందించాలి, ఏవి చేయొద్దు అన్న అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో రెవెన్యూ చట్టంపై కొంత అయోమయం నెలకొన్నట్లయింది.

పేరుకుపోతున్న వినతులు

ఆపరేషనల్‌ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో ధరణి పోర్టల్‌ మాత్రం అమల్లోకి వచ్చింది. ఇతర విధులు, కొత్త బాధ్యతలపై ఆదేశాలు జారీ చేయకపోవడంతో తహసీల్దార్లు పాసుపుస్తకాల ప్రచురణ, మ్యుటేషన్లు తదితరాలను ముట్టుకోవడం లేదు. కరోనాతో మార్చి నెలాఖరు నుంచి తహసీల్దారు కార్యాలయాల్లో భూ సంబంధిత సేవలు నిలిచిపోయాయి. సెప్టెంబరు నుంచి ప్రభుత్వం టీఎస్‌ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌ వెబ్‌సైట్‌ను నిలిపివేసింది. ఇలా పలు కారణాలతో తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాల్లో భూ సమస్యల పరిష్కారానికి సంబంధించిన వినతులు పేరుకుపోతున్నాయి. మార్గదర్శకాలు జారీ అయ్యేంత వరకు తామేమీ చేయలేమని తహసీల్దార్లు చెబుతుండటంతో రైతులు, భూ యజమానులు భూముల రిజిస్ట్రేషన్‌ పనుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అవస్థల పాలవుతున్నారు.

పాత చలానాలు చెల్లవిక..

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పునఃప్రారంభమైనా పాత చలానాలు చెల్లుబాటు కాక వేలాదిమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం సెప్టెంబరు 8 నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఇలా నిలిపివేయడానికి ముందు చలానాలు కట్టి అప్పట్లో రిజిస్ట్రేషన్లు చేయించుకోక ఇప్పుడు చేయించుకుందామని వెళ్తే కుదరడం లేదు. వాటితో ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదని సబ్‌రిజిస్ట్రార్లు స్పష్టం చేస్తున్నారు. తిరిగి రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించి, స్లాట్‌ బుక్‌ చేసుకొని రావాలని సూచిస్తున్నారు. దీంతో గతంలో లక్షల రూపాయలు కట్టిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా రిజిస్ట్రేషన్‌ కోసం చలానా కడితే ఆరు నెలల వరకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

అనివార్య కారణాలతో ఆస్తి కొనుగోలు వద్దనుకుంటే దానిని రద్దు చేసుకోవచ్చు. ఆ డబ్బులు వెనక్కి రావడానికి ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే చలానాలు తీసుకుని మూడు నెలలుపైగానే కావడంతో కొత్త రిజిస్ట్రేషన్లకు వాటిని ఉపయోగించుకునేలా అవకాశం కల్పించాలని పలువురు సబ్‌రిజిస్ట్రార్లను సంప్రదిస్తున్నారు. అది విధానపరమైన నిర్ణయమని తాము ఇందులో చేయగలిగింది ఏమీలేదని వారు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాత చలానాలు ఉన్న వారు.. కొత్తగా చేసుకునే రిజిస్ట్రేషన్లకు వాటిని వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని లేదా చలానాను రద్దు చేసుకుంటే వెంటనే డబ్బులు వెనక్కి ఇచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.