ETV Bharat / city

ఏఓబీలో ఈ నెల 21న బంద్​కు మావోల పిలుపు

author img

By

Published : Dec 19, 2020, 10:37 PM IST

ఏఓబీ బంద్​కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఈ నెల 12న జరిగిన ఎన్​కౌంటర్​ను వ్యతిరేకిస్తూ.. మావోయిస్టులు ఆడియో టేప్​ విడుదల చేశారు.

ఏఓబీలో ఈ నెల 21న బంద్​కు మావోల పిలుపు
ఏఓబీలో ఈ నెల 21న బంద్​కు మావోల పిలుపు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగవరం గ్రామంలో ఈ నెల 12వ తేదీన జరిగిన ఎన్​కౌంటర్​ను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ ఈ నెల 21న ఏవోబీ ప్రాంతంలో బంద్​కు పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీ ఏవోబీ ఎస్​జెడ్​సీ అధికార ప్రతినిధి కైలాసం పేరిట లేఖ, ఆడియో టేప్​ విడుదల చేశారు. నిద్రలో ఉన్న మావోయిస్టులపై దారుణంగా కాల్పులు జరిపి హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాత్రి రెండుగంటల సమయంలో ఒడిశా పోలీసులు మావోయిస్టులను చుట్టుముట్టి పట్టుకుని కాల్చి చంపారని ఆరోపించారు. పార్టీ సభ్యులతో పాటు అదే గ్రామానికి చెందిన పసిపాపను కూడా హతమార్చారని వాపోయారు. ఈ ఘటనను దారుణంగా ఖండిస్తూ ఏవోబీ ప్రాంతమంతటా బంద్ పాటించాలని లేఖలో స్పష్టం చేశారు.

december-21st-aob-bandh
మావోయిస్టులు విడుదల చేసిన లేఖ
december-21st-aob-bandh
మావోయిస్టులు విడుదల చేసిన లేఖ

ఇదీ చదవండి: పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టి 150 గొర్రెలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.