ETV Bharat / city

'పోలవరం ప్రాజెక్ట్‌ గరిష్ఠ వరద వల్ల ఎలాంటి ముంపు సమస్య ఉండదు' - పోలవరం

CWC MEETING ON POLAVARAM CONSTRUCTION : పోలవరం ప్రాజెక్ట్‌ గరిష్ఠ వరద వల్ల ఎలాంటి ముంపు సమస్య ఉండదని కేంద్ర జలసంఘం తేల్చిచెప్పింది. బ్యాక్‌ వాటర్‌ వల్ల ఏర్పాడే సమస్యపై మళ్లీ అధ్యయనం చేయాలన్న మూడు రాష్ట్రాల డిమాండ్‌ను తోసిపుచ్చింది. పోలవరం ప్రభావిత రాష్ట్రాలకు ఉన్న సాంకేతిక అభ్యంతరాలను ఈనెల 19లోగా తెలియజేస్తే నివృత్తి చేస్తామని కేంద్ర జలసంఘం భరోసా ఇచ్చింది. పోలవరం వరద, బ్యాక్‌వాటర్ ముంపు సమస్యపై మళ్లీ అధ్యయనం చేయాలని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్​ కోరగా.. గరిష్ఠ వరద వల్ల ఎలాంటి సమస్య ఉండదని, ప్రాజెక్ట్‌తో అన్ని రాష్ట్రాలకు లాభమేనని సీడబ్య్లూసీ తేల్చి చెప్పింది.

'పోలవరం ప్రాజెక్ట్‌ గరిష్ఠ వరద వల్ల ఎలాంటి ముంపు సమస్య ఉండదు'

author img

By

Published : Oct 8, 2022, 11:29 AM IST

పోలవరం ప్రాజెక్టుపై సీడబ్ల్యూసీ సమావేశం

CWC MEETING ON POLAVARAM CONSTRUCTION : దిల్లీలో కేంద్ర జలసంఘం ఛైర్మన్ ఆర్కే గుప్తా అధ్యక్షతన జరిగిన సమావేశంలో .. ముంపు సమస్య, తాజా వరదలతో ఏర్పడ్డ ఇబ్బందులను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రతినిధులు ప్రస్తావించారు. గరిష్ఠంగా ఎంత వరదను అంచనా వేసి స్పిల్‌వే నిర్మిస్తున్నారు.. బ్యాక్‌వాటర్ ప్రభావం, ముంపు ప్రాంతాల్లో రక్షణ చర్యలపై మూడు రాష్ట్రాలు ప్రశ్నించాయి. పోలవరం ప్రాజెక్ట్‌తో ఎలాంటి భయం వద్దన్న జలసంఘం ఛైర్మన్‌.. అన్ని రాష్ట్రాలు దీంతో ప్రయోజనం పొందుతాయని అభయమిచ్చారు.

మూడు రాష్ట్రాలు లేవనెత్తిన సమస్యలపై రాష్ట్ర అధికారులు అభ్యంతరం తెలిపారు. అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో ఎలా వ్యవహరించారో ఇక్కడా అదే విధంగా అనుసరించాలని.. పోలవరాన్ని ప్రత్యేకంగా చూడొద్దని కోరారు. ఉమ్మడి సర్వేకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న రాష్ట్ర అధికారులు.. దీనికి ఆయా రాష్ట్రాలు సహకరించాలని కోరారు. గోదావరిలో గరిష్ఠంగా 50 లక్షల వరద వస్తుందని ఐఐటీ హైదరాబాద్.. 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ రూర్కీ అధ్యయనాల గురించి ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రస్తావించగా ఏపీ అభ్యంతరం తెలిపింది. గోదావరి చరిత్రలో ఇంతవరకు 36 లక్షల క్యూసెక్కుల గరిష్ఠ వరద మాత్రమే వచ్చిందని కేంద్ర జలసంఘం కూడా పేర్కొంది.

గరిష్ఠంగా 58 లక్షల క్యూసెక్కుల వరద అంచనాలున్నాయని తదనుగుణంగా స్పిల్‌ వే డిజైన్లు, బ్యాక్‌ వాటర్‌ ప్రభావం ఎదుర్కొనేలా చర్యలు ఉండాలని ఛత్తీస్‌గఢ్‌ కోరింది. స్పిల్‌ వే డిజైన్లకు 58 లక్షల గరిష్ఠ వరదనే పరిగణనలోకి తీసుకోవాలని ఒడిశా కూడా అభిప్రాయపడింది. కేంద్ర జలసంఘం, ఏపీ నిర్వహించిన సర్వేకు కొన్ని పరిమితులు ఉన్నాయని ఒడిశా అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ముంపు ప్రాంతాల గుర్తింపునకు సంయుక్త సర్వేకు ఒడిశా అంగీకరించాలని ఏపీ కోరింది. ఆపరేషన్‌ ప్రొటోకాల్, హైడ్రాలజీ వంటి అంశాలు తేలే వరకు సంయుక్త సర్వేకు తాము అంగీకరించబోమని ఒడిశా స్పష్టం చేసింది.

పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై మళ్లీ అధ్యయనం చేయాలని తెలంగాణ కోరింది. తాజా వరదల నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం సాగాలని తెలిపింది. 2022 వరదల వల్ల ప్రభావితమైన 28,000 ఆవాస ప్రాంతాలు, 11,000 కుటుంబాలు, 103 గ్రామాలు సరైన బ్యాక్‌ వాటర్‌ అధ్యయనాలు అవసరమంటున్నాయని తెలిపింది. వివిధ కేంద్ర జలసంఘం అధ్యయనాలు, 2022 జులైలో ఏర్పడ్డ వరదలను పోలుస్తూ తెలంగాణ అధికారులు అనేక అంశాలు ప్రస్తావించారు. పోలవరంలో గరిష్ఠ నీటి మట్టం వద్ద నీరు నిలబడి ఉన్నప్పుడు ఏర్పడే ప్రభావం కూడా కీలకమని తెలంగాణ పేర్కొంది. గోదావరికి ఎగువన రెండువైపులా ఉన్న అనేక వాగులు, వంకలకు సంబంధించి ఉమ్మడి సర్వే చేయాలని తెలంగాణ కోరింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.