ETV Bharat / city

సాగు ఖర్చేమో బారెడు.. రుణమిచ్చేది మాత్రం మూరెడు - crop loan limit in telangana

Crop Loan in Telangana : రాష్ట్ర బ్యాంకర్ల సాంకేతిక కమిటీ పంటలకు వార్షిక రుణ పరిమితి ఖరారు చేసింది. గతేడాది కన్నా ఈ ఏడాది పంటరుణాన్ని కొన్ని పంటలకే పరిమితంగా పెంచి, మరికొన్నింటికి ఒక్క రూపాయి కూడా పెంచలేదు. రోజురోజుకు పంట సాగు ఖర్చులు పెరిగి రైతులపై భారం పడుతుండగా.. ఇంకా ఎక్కువ రుణాలిచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకులు వ్యయాలకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోకపోవడం పట్ల కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని పథకాలొచ్చినా.. తమ బతుకులు మాత్రం మారడం లేదని వాపోతున్నారు.

Crop Loan in Telangana
Crop Loan in Telangana
author img

By

Published : Apr 27, 2022, 7:56 AM IST

Crop Loan Limit in Telangana : వానాకాలం(ఖరీఫ్‌) పంటల సాగుకు బ్యాంకులివ్వాల్సిన రుణాలను అరకొరగా పెంచారు. పంట సాగు చేయడానికి రైతు పెడుతున్న పెట్టుబడి ఖర్చుకు, బ్యాంకులిచ్చే రుణానికి పొంతన లేకుండా ‘రుణ పరిమితి’(స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌)ను రాష్ట్ర బ్యాంకర్ల సాంకేతిక కమిటీ ఖరారు చేసింది. సాగు ఖర్చులకు అనుగుణంగా గతేడాది కన్నా ఈ ఏడాది పంటరుణాన్ని కొన్ని పంటలకే పరిమితంగా పెంచి, మరికొన్నింటికి ఒక్క రూపాయీ పెంచకుండా వదిలేయడం గమనార్హం. రోజురోజుకు పంట సాగు ఖర్చులు పెరిగి రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుండగా వారికి మరింత ఎక్కువగా రుణాలిచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకులు పెద్దగా పట్టించుకోలేదు.

Annual Crop Loan in Telangana : రాష్ట్రంలో కూరగాయల కొరత తీవ్రంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి పెద్దయెత్తున రోజూ దిగుమతి అవుతుండగా రైతులు సాగుచేసే కూరగాయ పంటలకిచ్చే రుణాలను ఏమీ పెంచలేదు. బత్తాయి, మామిడి, అరటి, సపోటా, పుచ్చ, తర్బూజ, సీతాఫలం తదితర పంటలకు ఇచ్చే రుణాల్లోనూ మార్పు చేయలేదు. వరికి బదులు ప్రత్యామ్నాయంగా అధిక ఆదాయం వచ్చే, సాగునీటి వినియోగం తక్కువగా ఉండే జొన్న వంటి ఆరుతడి పంటలు వేయాలని ప్రభుత్వం చెబుతుంటే రుణ పరిమితి ఖరారులో అందుకు విరుద్ధంగా కమిటీ నిర్ణయించడం గమనార్హం.

Scale Of Finance for crops : రాష్ట్ర బ్యాంకర్ల సాంకేతిక కమిటీకి ఛైర్మన్‌గా రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఉన్నారు. బ్యాంకులు అన్ని రంగాలకు ఇచ్చే మొత్తం రుణాల్లో వ్యవసాయరంగానికి దక్కుతున్న వాటా చాలా తక్కువగా ఉందని, దాన్ని పెంచాలని ఇటీవల ఆయన సూచించారు. అయినా బ్యాంకులు పెద్దగా పట్టించుకున్నట్లు లేదని రుణపరిమితి లెక్కలు వివరిస్తున్నాయి.

విత్తన పత్తి, విత్తన వరి పంటలకు ఒక్క రూపాయి రుణం పెంచలేదు.

సాగు వ్యయానికి తగ్గట్టుగా పంటరుణం ఇవ్వాలని నాబార్డు సూచించినా పలు పంటలకు అసలే పెంచలేదు.

సాగుకు మరింత మంది దూరమవుతారు : "కూలీ రేట్లు, డీజిల్‌, పెట్రోల్‌, విత్తన ధరలు బాగా పెరగడంతో పంట సాగు ఖర్చు బాగా పెరిగిందని రైతు సంఘాల అధ్యయనంలో తేలింది. ఆ మేర పంటల సాగుకు రుణాలు పెంచి ఇవ్వకపోతే రైతులు మరింత అప్పులపాలవుతారు. పంటల సాగుకు మరింత ఎక్కువ మంది దూరమవుతారు."

-పాకాల శ్రీహరిరావు, అధ్యక్షుడు, రాష్ట్ర రైతు రక్షణ సమితి

Scale Of Finance for crops in Telangana :రాష్ట్ర బ్యాంకర్ల సాంకేతిక కమిటీ ఖరారు చేసిన పంట రుణాల్లో రాష్ట్రంలో ప్రధాన పంటలైన వరి, పత్తిలకు రూ.38,000 (2021-22) నుంచి రూ.40,000(2022-23) పెంచారు. అలాగే ఆయిల్‌పాం రూ.38,000 నుంచి రూ.42,000కు, మిరప రూ.70,000 నుంచి రూ.75,000కు పెంచారు. వరికి ప్రత్యామ్నాయమైన జొన్నకు మాత్రం రూ. 20,000 నుంచి రూ.18,000 తగ్గింది. ఒక్క రూపాయి కూడా పెరగని పంటల్లో విత్తన పత్తి(రూ.1,40,00), విత్తన వరి(రూ.45,000), చెరకు(రూ.75,000), టమాటా (రూ.50,000) ఉన్నాయి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.