ETV Bharat / city

రాజకీయ జోక్యం లేకుండా అర్హులను గుర్తించండి: చాడ - వరద సాయం పంపిణీపై చాడ వెంకట్ రెడ్డి విమర్శలు

వర్షాలతో నష్టపోయిన వారికి అందించే పరిహారం అర్హులకు ఇవ్వకపోవడం వల్లనే నిరసనలు వ్యక్తమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి అన్నారు. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా బాధితులను గుర్తించాలని సూచించారు.

cpi state secretary comments on failure on flood relief fund distribution in hyderabad
తెరాస నేతల ప్రమేయంతోనే రసాభస: చాడ
author img

By

Published : Oct 31, 2020, 4:54 PM IST

వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేతలో రాజకీయ నాయకుల ప్రమేయంతోనే... రసాభస అవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం బాధితులను గుర్తించకుండా... ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెరాస నాయకుల ప్రమేయంతో పంపిణీ చేస్తున్నందునే నిరసనలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు.

రాజకీయ జోక్యం లేకుండా తక్షణమే ప్రభుత్వం పారదర్శకతతో... బాధితులను గుర్తించి ప్రతి ఒక్కరికీ పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. స్వప్రయోజనాల కోసమే ప్రభుత్వం పరిహారం చెల్లించిందనే అప్రతిష్ట మూటగట్టుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రాజకీయ జోక్యం లేకుండా అర్హులను గుర్తించండి: చాడ

ఇదీ చూడండి: ప్రభుత్వాలే మారుతున్నాయి.. కార్మికుల బతుకులు కాదు: చాడ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.