పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫసర్ లింబాద్రి.. ఫలితాలను విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష.. సీపీజీఈటీ-2021. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, మహాత్మగాంధీ, జేఎన్టీయూ పరిధిలోని ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం వంటి సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సీపీగెట్ నిర్వహించారు.
30 జులై నుంచి 25 ఆగస్టు వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. రూ. 500 ఆలస్య రుసుముతో 30 ఆగస్టు వరకు, రూ. 2000 ఆలస్య రుసుంతో 03 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రవేశ పరీక్షలు జరిగాయి. యూనివర్సిటీల్లోని 42 పీజీ, నాలుగు పీజీ డిప్లొమా, నాలుగు ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పది రోజుల పాటు జరిగిన ప్రవేశ పరీక్షలకు 68 వేల 836 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: