ETV Bharat / city

కండక్టర్​పై దాడి కేసులో కానిస్టేబుళ్ల సస్పెన్షన్ - బస్సు కండాక్టర్ శ్రీలత తలపై తుపాకీతో దాడి

ఆర్టీసీ బస్సు మహిళా కండక్టర్​తో అసభ్యకరంగా ప్రవర్తించి ఆమెపై దాడి చేసిన కేసులో ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

cp Anjani Kumar issued orders of constables suspension
ఆ ఇద్దరు కానిస్టేబుళ్లును సస్పెండ్ చేసిన సీపీ
author img

By

Published : Mar 6, 2020, 12:40 PM IST

మహబూబ్​ నగర్​ జిల్లా జడ్చర్లలో మహిళా కండక్టర్​తో దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్​ నగర సీపీ ఉత్తర్వులు జారీ​ చేశారు. కానిస్టేబుల్​ రామకృష్ణ గురువారం జడ్చర్లలో హైదరాబాద్-2 డిపోకు చెందిన బస్సు కండక్టర్ శ్రీలత తలపై తుపాకీతో దాడి చేసిన ఘటనపై సీపీ స్పందించారు.

కానిస్టేబుల్ సత్యనారాయణ రెడ్డి, రామకృష్ణ ఓ ఖైదీని చర్లపల్లి జైలు నుంచి జడ్చర్ల న్యాయస్థానానికి తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో జడ్చర్లలోని సిగ్నల్ గడ్డ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కారు. టికెట్ తీసుకోవాల్సిందిగా మహిళా కండక్టర్ కోరారు. వారు కొత్త బస్టాండ్ వరకే వస్తామన్నారు. మధ్యలో తనిఖీ జరిగితే తనకు ఇబ్బంది అవుతుందని టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ అన్నారు. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో రామకృష్ణ తన చేతిలో ఉన్న తుపాకీతో శ్రీలత తలపై కొట్టాడు. కండక్టర్ జడ్చర్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: కుబేరుల సంఖ్యలో వచ్చే ఐదేళ్లలో భారత్​ నెం.1

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.