ETV Bharat / city

covid-19: రోగులను పీల్చిపిప్పిచేస్తున్న ప్రైవేట్​ ఆస్పత్రులు - కరోనా వైరస్ పరీక్ష

హైదరాబాద్​ బంజారాహిల్స్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో 15 రోజుల కొవిడ్‌ చికిత్సకు రూ.22 లక్షల బిల్లు వేశారు. అయినా ప్రాణం దక్కలేదు. కూకట్‌పల్లిలోని ఓ దవాఖానాలో పది రోజులు చికిత్స పొందితే రూ.18 లక్షలు వసూలు చేశారు. తర్వాత వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో మరో బాధితుడికి 12 రోజుల చికిత్సకు రూ.15 లక్షల బిల్లు వేశారు.

covid hospitals charging high fees from patients in hyderabad

author img

By

Published : May 29, 2021, 6:53 AM IST

కరోనా సోకి దిక్కుతోచక నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితులను ప్రైవేటు ఆస్పత్రులు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాయి. కొన్ని పీల్చిపిప్పి చేస్తున్నాయి. ఓ మాదిరి సౌకర్యాలున్న దవాఖానాలో రోజుకు రూ.లక్ష వసూలు చేస్తున్నారు. మందుల ఖర్చు దీనికి అదనం... నామమాత్రపు సౌకర్యాలతో ఉన్న ఓ చిన్న ఆస్పత్రి వసూలు చేసేది రోజుకు రూ.40-రూ.50 వేలు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే ఇది అయిదు నుంచి పది రెట్లు ఎక్కువ. ఇలా అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని 64 ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో కొన్నింటిపై ఎక్కువ సంఖ్యలోనే ఫిర్యాదులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఆస్పత్రుల్లో అత్యధికం హైదరాబాద్‌లోవే.

వరంగల్‌, హన్మకొండ, నిజామాబాద్‌, సంగారెడ్డిలోని కొన్ని ప్రధాన దవాఖానాలూ ఉన్నాయి. కూకట్‌పల్లి ప్రధాన రోడ్డుపై ఉన్న ఓ ప్రముఖ ఆస్పత్రిపై ఆరు ఫిర్యాదులొస్తే, బేగంపేటలో మెయిన్‌రోడ్డులోని మరో కార్పొరేట్‌ ఆస్పత్రిపై అయిదు ఫిర్యాదులొచ్చాయి. కాచిగూడ, అబిడ్స్‌లోని రెండింటిపై మూడేసి, మరో 11 ఆస్పత్రులపై రెండేసి, 49 దవాఖానాలపై ఒక్కో ఫిర్యాదు వచ్చాయి. ఇందులో నగరంలోని కార్పొరేట్‌ ఆస్పత్రులూ ఉన్నాయి. వైద్యుడు రోజూ అయిదారుసార్లు వెళ్లి పరిశీలించినట్లు, అన్ని సార్లు పీపీఈ కిట్లు వాడినట్లు, రోగి సామాజిక దూరం పాటించేలా చూసినందుకు రూ.2,500, తడి వ్యర్థాలు పారేసినందుకు రూ.2,500 ఇలా రకరకాల బిల్లులు వేశారు. బీమా కంపెనీలు సైతం ఇలాంటి బిల్లులను తిరస్కరించాయి. దీంతో బీమా ఉన్న రోగులూ అదనంగా రూ. వేల చెల్లించాల్సి వచ్చింది.

కొన్ని ఆస్పత్రులు మొదట ఓ బిల్లు వేసి అంతా సెటిల్‌ అయ్యాక, ఇవి బీమాలో చేరనివంటూ అదనంగా రూ. లక్షల బిల్లులు ఇచ్చినట్లు ఓ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. మందులు కాకుండానే రోజుకు రూ.40వేల నుంచి రూ.లక్షకు పైగా వసూలు చేశారనే ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా సరైన వైద్యం చేయకుండా రూ.లక్షలు గుంజారని ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిసింది. అవసరం లేకుండానే అధిక మోతాదులో స్టిరాయిడ్స్‌ వాడటంతో బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డామని, వైద్యంలో లోపం వల్లే ఇలా జరిగిందంటూ తగు చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖకు పలువురు తెలిపారు.

సర్కారు చెప్పిందేంటి?

  • ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలకు ఛార్జీలను ప్రభుత్వం మూడు రకాలుగా ఖరారు చేసింది.
  • రోజుకు ఐసొలేషన్‌లో రూ.4,000, ఐసీయూలో రూ. 7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ చికిత్సకు రూ. 9,000 చొప్పున వసూలు చేయాలని ఆదేశాలిచ్చింది. రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్‌రే, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బి, సి.. తదితర పరీక్షల రేట్లు, కొన్ని సాధారణ ఔషధాలను కూడా ఇందులో చేర్చింది.
  • కొన్ని ఖరీదైన ఔషధాలు, ఖర్చుతో కూడిన నిర్ధారణ పరీక్షలు, పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కులకు మినహాయింపు ఇచ్చింది.
  • అత్యధిక ఆసుపత్రుల్లో ఈ ఉత్తర్వులు అమలవడం లేదు. ఐసొలేషన్‌ వార్డులో ఉన్నా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఇక బిల్లులోనే కాదు.. చికిత్సల్లోనూ పారదర్శకత లేదని బాధితులు తమ ఫిర్యాదుల్లో వాపోయారు.

ఇదీచూడండి:

license cancel: ప్రైవేటులో అధిక బిల్లుల వసూళ్లపై సర్కారు కన్నెర్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.