ETV Bharat / city

కరోనా ఉద్ధృతితో ఉపాధ్యాయులు విలవిల

కరోనా రెండో దశ వ్యాప్తి.. ఉపాధ్యాయులకు ప్రాణసంకటంగా మారింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో మహమ్మారికి బలవ్వగా.. వందలాది మంది వ్యాధితో పోరాడుతున్నారు. 2 నెలల్లో.. ఒక్క ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాలోనే.. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 57 మంది ఉపాధ్యాయులు మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తమకూ వ్యాక్సిన్‌ ఇచ్చి ప్రాణాలు కాపాడాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

covid-effect-on-teachers
కరోనా తాకిడితో ఉపాధ్యాయులు విలవిల
author img

By

Published : May 31, 2021, 10:12 AM IST

కరోనా తాకిడితో ఉపాధ్యాయులు విలవిల

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాలో కరోనా తాకిడికి ఉపాధ్యాయులు విలవిల్లాడుతున్నారు. మార్చిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో మహమ్మారి బారినపడ్డారు. ఎన్నికల విధులతోపాటు కరోనా రోగుల సమాచారం సేకరణ, నాడు-నేడు రెండో విడత పనులకు బ్యాంకు ఖాతాలు తెరవడం, జగనన్న విద్యాదీవెన కిట్ల పంపిణీ ఏర్పాట్లు వంటి కార్యక్రమాల వల్ల.. గురువులు బయటకు రాకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా కరోనా కోరలకు చిక్కి విలవిల్లాడుతున్నారు.

చాలా మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్సలతో ఆర్థికంగా చితికిపోగా.. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 57 మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు ఏటీ అగ్రహారంలో ఫరుద్దీన్ అనే విశ్రాంత ఉపాధ్యాయుడి ఇంట్లో కరోనాతో మొత్తం ఐదుగురు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాగే చాలా ఇళ్లల్లో ఇద్దరు, ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.

జూన్ నెలాఖరు వరకు పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. నిత్యం వేలాది మంది పిల్లలతో కలిసి ఉండే తమకు వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. కరోనా రెండో దశ ప్రబలుతున్న వేళ... వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి... తమకూ ప్రాధాన్యమివ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: TS News: అ.ని.శాకు చిక్కిన జీహెచ్ఎంసీ డీఈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.