ETV Bharat / city

రాష్ట్రంలో కరోనా విజృంభణ.. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం - ts latrst caes

రాష్ట్రంలో కొత్తగా 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి వలస వచ్చినవారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 175 కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారిన పడి మరో 9 మంది మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 165కు చేరింది.

209 కొత్త కేసులు
209 కొత్త కేసులు
author img

By

Published : Jun 12, 2020, 5:36 AM IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా నిర్ధరణ అవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో నిత్యం కరోనా కేసులు పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 209 కేసులు నిర్ధరణ కాగా మొత్తం కేసుల సంఖ్య 4,320కి చేరింది. వాటిలో రాష్ట్రానికి చెందిన వారు 208 మంది ఉండగా.. ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వలస కూలీకి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గురువారం 9 మంది కరోనాతో మృతి చెందగా.. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 165కు చేరింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 175 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మేడ్చల్‌ జిల్లాలో 10 కేసులు, రంగారెడ్డిలో 7, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాల్లో 3 చొప్పున నమోదయ్యాయి. వరంగల్‌ అర్బన్‌, ఆసిఫాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఇద్దరికి చొప్పున కరోనా సోకింది. కామారెడ్డి, వరంగల్‌ రూరల్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,993 మంది కరోనా నుంచి కోలుకోగా.. 2,162 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 3,871 రాష్ట్రానికి చెందినవారు కాగా.. మరో 449 మంది వలస కార్మికులు, ఇతర దేశాల నుంచి వచ్చినవారిగా గుర్తించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.