మాజీ రాష్ట్రపతి, సీనియర్ రాయకీయ నాయకులు ప్రణబ్ ముఖర్జీ మృతికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం ప్రకటించారు. రాజకీయవేత్తగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయకు ప్రణబ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవారని గుత్తా తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న కాలంలో నిరాశ పరచకుండా ప్రోత్సహించేవారని ఆయన చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు.
ఇవీచూడండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ అస్తమయం