ETV Bharat / city

బయట తిరుగుతున్న కరోనా బాధితులు... ఆందోళనలో ప్రజలు

author img

By

Published : Jul 11, 2020, 8:45 PM IST

ఖైరతాబాద్ డివిజన్‌లో కొవిడ్‌ బారిన పడినవారు వారి ఇళ్ల వద్దే చికిత్స తీసుకుంటున్నారు. అయితే వారిలో కొందరు బయట తిరుగుతున్నారని డివిజన్‌ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వారిపట్ల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

corona victims wandering outside in khairatabad division hyderabad
బయట తిరుగుతున్న కరోనా బాధితులు... ఆందోళనలో ప్రజలు

హైదరాబాద్‌లో రోజు రోజుకు కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఖైరతాబాద్ డివిజన్‌ పరిధిలో ఇప్పటివరకు 30 కేసులు నమోదయ్యాయి. ఇళ్లలోనే చికిత్స తీసుకుంటున్న బాధితుల్లో కొందరు బయట తిరుగుతున్నారని స్థానికులు అంటున్నారు.

రెండు నెలలు క్రితం కరోనా వచ్చిన వారు ఉండే విధినే మూసివేశారని... ఇప్పుడు అలాంటి నిబంధనలు లేకపోవడం వల్ల కరోనా సోకినవారు బయటకు వస్తున్నారని... దీంతో భయాందోళనకు గురవుతున్నామని చుట్టూ పక్కల ఇళ్లవాళ్లు, కాలనీవాసులు అంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఇలాంటి వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని... కొవిడ్‌ టెస్టుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఘట్‌కేసర్‌లో హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.