ETV Bharat / city

బ్యాంకింగ్​పై కరోనా ప్రభావం.. 400పైగా బాధితులు

కరోనా విజృంభణ.. రాష్ట్రంలో బ్యాంకింగ్​ రంగాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నా.. సుమారు 438 మంది సిబ్బంది ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. ఇద్దరు ఉద్యోగులు మరణించారు. కొందరు కోలుకున్నారు.. మరికొందరు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

CORONA EFFECT ON BANKING SECTOR
బ్యాంకింగ్​పై కరోనా ప్రభావం.. 400పైగా బాధితులు
author img

By

Published : Jul 7, 2020, 1:48 PM IST

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రోజూ వేయికి పైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సుమారు 80 నుంచి 90 శాతం పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు , మీడియా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు.

కరోనా ప్రభావం బ్యాంకింగ్​ రంగంపైనా ఎక్కువగా ఉంది. సిబ్బంది అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా.. వైరస్​ బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 438 మంది బ్యాంకింగ్​ సిబ్బందికి కరోనా సోకింది. ఎస్​బీఐకి చెందిన వారే 81 మంది ఉన్నారు. ఇటీవల పాతబస్తీలో ఎస్​బీఐ మేనేజర్​ మరణించారు.

ఖాతాదారుల నుంచీ..

బ్యాంక్​ వద్దనున్న భద్రతా సిబ్బంది.. లోపలికి ప్రవేశించేవారికి ఉష్ణోగ్రత పరీక్షించాలి.. చేతులు శుభ్రపరుచుకునేందుకు శానిటైజర్​ ఇవ్వాలి. మాస్క్​ ధరించినవారిని మాత్రమే అనుమతించాలి. ఒక్కొక్కరిని మాత్రమే లోపలికి వెళ్లనివ్వాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఒకవేళ సిబ్బంది సూచనలు చేసినా.. ఖాతాదారులు గొడవలకు దిగుతున్నారు. ఖాతాదారులు ప్రవర్తన వల్లనే సిబ్బంది కరోనా బారిన పడుతున్నారని.. ఆల్‌ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు నాగేశ్వర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

నెగిటివ్​ వస్తేనే..

ఏ బ్యాంకు సిబ్బందికి పాజిటివ్​ వచ్చినా.. తక్షణమే ఆశాఖను మూసివేస్తున్నారు. అందులోని సిబ్బందికి కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. కార్యాలయాన్ని శానిటైజ్​ చేసిన తర్వాత నెగెటివ్​ వచ్చిన వారితో తిరిగి బ్యాంకింగ్​ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారు.

హైదరాబాద్​ సరూర్‌నగర్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో ఓ ఉద్యోగి కరోనా బారిన పడడంతో ఆ కార్యాలయాన్ని మూసివేశారు. ఎస్​బీఐ శాఖలు పదుల సంఖ్యలో మూసి ఉన్నాయి. హైదరాబాద్​ పాతబస్తీలో మూతబడుతున్న బ్యాంకు శాఖలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎస్​బీఐ తన సిబ్బందికి చికిత్స​ అందించేందుకు రెండు ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. మిగిలిన బ్యాంకులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాయి. డిజిటల్​ బ్యాంకింగ్​పై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని పలువులు బ్యాంక్​ యూనియన్​ నాయకులు కోరుతున్నారు.

ఇవీచూడండి: నిమ్స్​లో భారత్​ బయోటెక్ కోవాగ్జిన్​ క్లినికల్‌ ట్రయల్స్‌.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.