హైదరాబాద్ నారాయణగూడ పరిధిలో కరోనా కలకలం రేగింది. ఓ అపార్ట్మెంట్లో సుమారు ఇరవై మంది కజకిస్థాన్ వాసులు నివాసం ఉంటున్నారు. వారిలో కొందరు నిన్నటి నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారనే అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు, వైద్య సిబ్బంది చేరుకుని.. అనుమానితులను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి: మరో రెండు పాజిటివ్... రాష్ట్రంలో 39కి చేరిన కరోనా కేసులు