ETV Bharat / city

కరోనా దోపిడీ: హైదరాబాద్​లో కార్పొరేటు ఆసుపత్రుల కాసులవేట - హైద‌రాబాద్ కరోనా వార్తలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్ పరిధిలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. జంటనగరాల్లోని దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరించిన వైరస్‌ అనేక కాలనీలు, అపార్ట్‌మెంట్లు, బస్తీలను కమ్మేసింది. కరోనా ఎలా సోకిందో కూడా బాధితులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అటు జీహెచ్‌ఎంసీ, వైద్య, ఆరోగ్య విభాగం, పోలీసులు కూడా కరోనా ట్రాక్‌ కనుగొనటం పూర్తిగా నిలిపివేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లభించటం లేదని బాధితులు గగ్గోలు పెడుతుండగా, ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన వారు ఆ బిల్లులు చూసి గుండెలు బాదుకుంటున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది.

coronavirus
coronavirus
author img

By

Published : Jul 8, 2020, 10:04 PM IST

జంటన‌గ‌రాల్లో క‌రోనా తీవ్రత అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇవాళ కూడా పెద్దసంఖ్యలో కేసులు న‌మోద‌య్యాయి. ప్రముఖ రచయిత, తెలంగాణ ప్రజానాట్యమండలి కార్యదర్శి నిస్సార్ కరోనాతో గాంధీ ఆస్పత్రిలో మృతి చెందారు. ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగినప్పటికీ ఎవ‌రు చేర్చుకోలేద‌ని.. చివరికి గాంధీ ఆస్పత్రిలో చేర్చుకున్నార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు.

కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోవాలని నిస్సార్ త‌న పాట‌ల ద్వారా ప్రజలను చైత‌న్యం చేశారు. యాదాద్రి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన కవి నిస్సార్‌.. టీఎస్ఆర్టీసీలో కంట్రోలర్‌గానూ విధులు నిర్వహిస్తు జగద్గిరిగుట్టలో నివాసముంటున్నారు. కరోనాతో కుల్సుమ్పురా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.

హోం క్వారంటైన్‌లో ఉస్మానియా సూపరింటెండెంట్

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 38 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. ఇందులో యూసుఫ్‌గూడలో 18, వెంగళరావునగర్‌లో 3, ఎర్రగడ్డలో 4, బోరబండలో 7, రహ్మత్ న‌గ‌ర్‌లో ఆరుగురికి వైరస్ సోకిన‌ట్లు అధికారులు తెలిపారు. సుల్తాన్ బజార్ ఇన్స్‌స్పెక్టర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు అధికారులు వెల్లడించారు. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు ఆసుప‌త్రి వర్గాలు తెలిపాయి.

కూకట్‌పల్లిలో మొత్తం 33 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో కూకట్‌పల్లి సర్కిల్‌లో 15, మూసాపేట్ 18 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 15 మందికి వైరస్ సోకింది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో 9, కొంపల్లి మున్సిపల్ పరిధిలో 2, నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో 4 కేసులు నమోదయ్యాయి.

కార్పొరేట్ చుక్కలు

క‌రోనా కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉండగా ప్రైవేట్‌ ఆస్పత్రులు తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రాణాలు కాపాడుకునేందుకు వస్తున్నవారి వద్ద నుంచి అందినకాడికి దండుకుంటున్నాయని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు అన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆస్పత్రుల ఎదుట బాధితులు ప్రత్యక్ష ఆదోళనకు దిగుతున్నారు. పది లక్షలకు తక్కువ కాకుండా ఒక్కొ రోగి నుంచి వసూలు చేస్తున్నారని ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరిన వైద్యురాలు తమ గోడును వెలుబుచ్చుతూ పంపిన వీడియో పరిస్థితికి అద్దం పట్టింది. వెంటిలేటర్, ఆక్సీజన్ పెట్టకపోయినా భారీగా బిల్లులు వేస్తున్నార‌ని వాపోయారు. 14 రోజులుగా నరకం చూపించారని.. మంత్రి ఈటలకు ఫోన్ చేసినట్లు బాధితురాలు వెల్లడించారు.

డబ్బులు కట్టకుంటే జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తాం

సికింద్రాబాద్‌లోని మరో కార్పొరేట్‌ ఆస్పత్రిలో ఇలాంటి వేధింపులే భ‌య‌టప‌డ్డాయి. బాలరాజు అనే వ్యక్తి గ‌త నెల 13న ఆస్పత్రికి వెళ్లగా టెస్ట్ చేయ‌గా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఇప్పటి వ‌ర‌కు మొత్తం 15 ల‌క్షల బిల్లు వేశార‌ని వాపోయారు. ఇన్సురెన్స్ క‌లిపి 5 ల‌క్షలు క‌ట్టామ‌ని... మిగతా 10 లక్షలు కడితేనే పేషెంట్ వద్దకు వెళ్లనిస్తామ‌ని లేదంటే పెషేంట్‌ను జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తామని బెదిరించారని కుటుంబసభ్యులు కన్నీళ్ల పర్వంతమయ్యారు.

ఈసీఐఎల్ చౌరస్తాలో జవహర్‌నగర్‌కు చెందిన పృథ్వీరాజ్ అనే యువ‌కుడు రోడ్డుపైనే కుప్పకూలి పోయాడు. కరోనా భయంతో అంబులెన్స్ వచ్చే వరకూ ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయారు. మూడు రోజులుగా జ్వరం రావడంతో కుటుంబ స‌భ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించడంతో ఆటోలో తరలించే క్రమంలో అక్కడిక్కడే మృతి చెందినట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

రేపటి నుంచి పరీక్షలు

జీహెచ్ఎంసీ పరిధిలో రేపటి నుంచి క‌రోనా టెస్టులు చేయ‌నున్నారు. గాజులరామారం, షాపూర్ నగర్, సూరారం, కుత్బుల్లాపూర్‌లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారు మాత్రమే పరీక్షలు చేసుకోవాలని అధికారులు తేల్చి చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి రోజు 25 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి : పద్మారావుకు కరోనాపై మంత్రి కేటీఆర్​ ఆసక్తికర వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.