ETV Bharat / city

కాలాపత్తర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో కంటైన్మెంట్​ జోన్​ - హైదరాబాద్​లో కరోనా ప్రభావం

హైదరాబాద్​ కాలాపత్తర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని రన్మస్త్​ పుర ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ నివాసం ఉంటున్నవారికి ఎలాంటి అవసరం ఉన్నా.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

kalapatter police station limits
కాలాపత్తర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో కంటైన్మెంట్​జోన్​ ఏర్పాటు
author img

By

Published : Apr 15, 2020, 3:03 PM IST

హైదరాబాద్​ కాలాపత్తర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని రన్మస్త్​ పుర ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా అధికారులు గుర్తించారు.

రన్మస్త్​ పుర ప్రాంతంలో మూడు రోజుల క్రితం ఓ వృద్ధురాలు కరోనా లక్షణాలతో మరణించింది. అప్రమత్తమైన అధికారులు ఆమె కుటుంబ సభ్యులందరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 11 మందికి కరోనా వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా గుర్తించినట్లు కాలాపత్తర్​ ఎస్​ఐ సుదర్శన్​ తెలిపారు.

వైద్య, పురపాలక, పోలీస్​ అధికారులు ప్రతినిత్యం ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తారని వెల్లడించారు. వారికి ఎలాంటి అవసరం ఉన్న తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిత్యవసర సరకులను ఇళ్ల వద్దకే వచ్చేలా ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.

కాలాపత్తర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో కంటైన్మెంట్​జోన్​ ఏర్పాటు

ఇవీచూడండి: సూపర్‌ మార్కెట్​కు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.