ETV Bharat / city

నన్ను బూచిగా చూపి కానిస్టేబుల్​ ప్రకాశ్​పై చర్యలు

author img

By

Published : Aug 30, 2022, 11:42 AM IST

Constable dismissal case victim తనను బూచిగా చూపి ఏఆర్​ కానిస్టేబుల్​ ప్రకాశ్‌పై చర్యలు తీసుకున్నారని కానిస్టేబుల్‌ డిస్మిస్‌ కేసులో బాధితురాలు లక్ష్మి వాపోయింది. ప్రకాశ్‌ తన నుంచి 30 తులాల బంగారం, రూ.10 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు మోపిన అభియోగంలో నిజం లేదని స్పష్టంచేసింది. కానిస్టేబుల్‌ తనను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, కక్ష సాధింపులో భాగంగానే తనను అడ్డం పెట్టుకుని ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె వాపోయింది.

Constable dismissal case victim
కానిస్టేబుల్‌ తొలగింపు కేసు బాధితురాలు

Constable dismissal case victim: తనను బూచిగా చూపి అనంతపురం ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను విధుల నుంచి తొలగించారని ఆ కేసులో పోలీసులు బాధితురాలుగా పేర్కొంటున్న బి.లక్ష్మి తెలిపింది. ఈ ఏడాది జూన్‌ 14న ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగిన సభకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకాగా, తమ బకాయిలు చెల్లించాలంటూ అదేరోజు అనంతపురంలో ప్లకార్డులు ప్రదర్శించిన కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను విధుల్లోంచి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. అదే జిల్లాలోని గార్లదిన్నెకు చెందిన మహిళ నుంచి ప్రకాశ్‌ బంగారం, డబ్బు తీసుకున్నారనే అభియోగంపై అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆదివారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. ఈ కేసులోని బాధితురాలు లక్ష్మి సోమవారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. ప్రకాశ్‌ తన నుంచి 30 తులాల బంగారం, రూ.10 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు మోపిన అభియోగంలో నిజం లేదని స్పష్టంచేశారు. కానిస్టేబుల్‌ తనను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, కక్ష సాధింపులో భాగంగానే తనను అడ్డం పెట్టుకుని ఆయనను తొలగించారని వాపోయింది.

తప్పుడు స్టేట్‌మెంట్‌ రాయించారు: ‘నా భర్త, అతని కుటుంబసభ్యులు నన్ను వేధిస్తున్నారని నాలుగేళ్ల కిందట గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అక్కడ న్యాయం జరగకపోవడంతో 2019లో ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వెళ్లాను అక్కడున్న సీఎం వలీ అనే కానిస్టేబుల్‌ నా ఫిర్యాదు రాస్తానని చెప్పి, నేను నా భర్త వేధింపుల గురించి చెప్తే ఆయన మరోలా రాశారు. కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ నన్ను వేధిస్తున్నట్లు, అత్యాచారం చేసినట్లు, నా నుంచి డబ్బు, బంగారం తీసుకుని మోసం చేసినట్లుగా రాశారు. ఎస్పీ వెళ్లిపోతున్నారని తొందరపెట్టి స్టేట్‌మెంట్‌ చదివే అవకాశం ఇవ్వకుండానే నాతో సంతకం చేయించుకున్నారు. దాని ఆధారంగానే కేసు నమోదుచేసి, అప్పటి డీఎస్పీ వీరరాఘవరెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టారు.

కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ నాపై అత్యాచారం చేసినట్లు మీడియాతో చెప్పారు. డీఎస్పీ ప్రెస్‌మీట్‌లో చెప్పింది తప్పు అని అప్పట్లోనే నేను టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేశాను. సీఐ జాకీర్‌ ఫిర్యాదు తీసుకోకుండా, విషయాన్ని కోర్టులో తేల్చుకోవాలన్నారు. నేను కోర్టును ఆశ్రయించి డీఎస్పీకి లీగల్‌ నోటీసులు ఇప్పించాను. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఇవేమీ పట్టించుకోకుండా నన్ను బూచిగా చూపించి ప్రకాశ్‌ను డిస్మిస్‌ చేయడం అన్యాయం అని అన్నది. డీఎస్పీ మా కుటుంబ పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించారు. ఇప్పుడు నా భర్త, పోలీసుల నుంచి మాకు ప్రాణహాని ఉంది. ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని లక్ష్మి ఆవేదన చెందారు. నా భర్త వేధింపులు తాళలేక ఎన్నోసార్లు గార్లదిన్నె పోలీసులు, జిల్లా ఎస్పీని ఆశ్రయించాను. స్పందనకు హాజరైనప్పుడు ప్రకాశ్‌ పరిచయమయ్యారు. కేసులో నాకు సహకరించారు. అప్పటికే అతనిపై కక్ష పెంచుకున్న ఉన్నతాధికారులు మా మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు చిత్రీకరించారు. కానిస్టేబుల్‌ సీఎం వలీ, డీఎస్పీ వీరరాఘవరెడ్డి ఈ దుష్ప్రచారం చేశారని ఆమె ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.