కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, పార్టీ కార్యకర్తలు కరోనా నియంత్రణ చర్యలకు సాయం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా సూచించారు. దేశ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని.. ఈ సమయంలో భౌతిక దూరం పాటించడం ఒకటే మార్గమన్నారు. కొవిడ్-19 నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్ధతిస్తుందన్నారు.
వైరస్ పరీక్షలకు సౌకర్యాలు కొరత ఉందని కుంతియా ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ వల్ల మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. భవిష్యత్‌లోనూ ఆర్థిక ఇబ్బందులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే సన్నకారు రైతులు, కార్మికులు, వేతన జీవులకు రూ. 7,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పేదలకు సహాయం చేయాలని కుంతియా సూచించారు.
ఇవీచూడండి: లాక్‌డౌన్‌కు ప్రజల సహకారం కావాలి : కేటీఆర్