ETV Bharat / city

ప్రధాని పర్యటన సందర్భంగా నిరసనలకు సిద్ధమవుతోన్న హస్తం నేతలు.. - భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

Congress Protests: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్‌ను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని చెబుతున్నకాంగ్రెస్‌ పార్టీ.... ప్రధాని పర్యటన సందర్భంగా నిరసన ప్రదర్శనలు చేసేందుకు సన్నద్దం అవుతోంది. మరో వైపు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేస్తున్న కాంగ్రెస్‌.... ప్రధాని హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా తెరాస తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికే యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేయనున్నట్లు షెడ్యూల్‌ ప్రకటించింది.

congress leaders planning to protest against agnipath at time of modi hyderabad tour

author img

By

Published : Jun 29, 2022, 5:28 PM IST

Congress Protests: రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం తన పోరాటాన్ని మరింత ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకుంది. అగ్నిపథ్‌ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని దీక్షలు చేస్తున్న కాంగ్రెస్‌.... హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నిరసనలు చేసేందుకు సిద్ధమైంది. అగ్నిపథ్‌పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు తమ పోరాటాన్ని ఆపేదిలేదని తేల్చి చెబుతోంది. మరోవైపు హైదరాబాద్‌లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు... వచ్చే నెల 3న మోదీ, అమిత్‌షా వస్తున్నందున నిరసన ప్రదర్శనలు చేయాలని ఇప్పటికే పీసీసీ నిర్ణయం తీసుకుంది. అలాగే మోదీ హైదరాబాద్‌ పర్యటనపై తెరాస తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

అగ్నిపథ్‌పై తెరాస తన వైఖరిని స్పష్టం చేయనట్లయితే... తెరాస, భాజపాల మధ్య అనైతిక బంధం ఉందని భావించాల్సి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. దీంతో ఇంతకాలం తెరాస... భాజపాల మధ్య బంధం ఉందని... ప్రధాని మోదీ ఆడించినట్లే సీఎం కేసీఆర్‌ ఆడుతున్నారని కాంగ్రెస్‌ చేస్తున్నతీవ్ర ఆరోపణలకు కూడా సమాధానం వస్తుందని భావిస్తున్నారు. కేంద్రం తెచ్చిన ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

యువజన కాంగ్రెస్‌ ఇవాళ్టి నుంచి రెండో తేదీ వరకు అగ్నిపథ్‌ పథకంపై నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సంతకాలు సేకరించనున్నట్లు యువజన కాంగ్రెస్ నేతలు తెలిపారు. మోదీ హైదరాబాద్ పర్యటనలో అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రేపు సామాజికమాధ్యమాల ద్వారా అవగాహన, ఎల్లుండి నిరసన దీక్షలు చేస్తామన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా, శాంతియుతంగా నిరసనలు ఉంటాయని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

మరోవైపు సికింద్రాబాద్‌ అల్లర్లలో అరెస్టైన వారికి న్యాయ సాయం చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. ఇందుకోసం న్యాయసహాయం చేసేందుకు ప్రత్యేకంగా గాంధీభవన్‌లో సెల్‌ ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలతో వచ్చే వారికి న్యాయ సహాయం చేసేందుకు సన్నద్దంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.