ETV Bharat / city

'ఇద్దరు సీఎంలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు' - ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వార్తలు

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తుంటే సీఎం కేసీఆర్ మిన్నకుండిపోయారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రోజుకు 3 టీఎంసీలు రాయలసీమకు తరలించుకుపోతే ఆయకట్టు జిల్లాలు ఎడారిగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

uttam kumar reddy
uttam kumar reddy
author img

By

Published : May 14, 2020, 1:38 PM IST

Updated : May 14, 2020, 2:48 PM IST

పోతిరెడ్డిపాడు అంశాన్ని నాగం జనార్దన్‌రెడ్డి జనవరి 4నే సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్... ఏపీ సీఎంతో ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే రెండుసార్లు ఇద్దరు సీఎంలు సమావేశమైనప్పటికీ పోతిరెడ్డిపాడుపై చర్చించలేదని పేర్కొన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను ఉత్తమ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతలు కలిశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తుంటే సీఎం కేసీఆర్ మిన్నకుండిపోయారు. ఏపీ ప్రభుత్వం రోజుకు 3 టీఎంసీలు రాయలసీమకు తరలించుకుపోతే ఆయకట్టు జిల్లాలు ఎడారిగా మారిపోతాయి. హైదరాబాద్‌ నగరానికి ప్రధాన తాగునీటి ఆధారం కృష్ణాజలాలే. ఏపీ ప్రభుత్వ వైఖరి వల్ల నాగార్జునసాగర్‌ కింద ఉన్న రైతులు కూడా నష్టపోతారు.

- ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌

'ఇద్దరు సీఎంలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు'

ఇదీ చదవండి: కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

Last Updated : May 14, 2020, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.