తెరాస వైఫల్యాలే తన విజయానికి దోహదపడతాయని గాంధీనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్రం చంద్రకళ శంకర్ అంటున్నారు. గాంధీనగర్ డివిజన్ నుంచి రెండు పర్యాయాలు ఓడిపోయినా... మూడో సారి ఎలాగైనా విజయం సాధించాలని బరిలోకి దిగినట్లు చంద్రకళ తెలిపారు.
అవినీతి పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారని చంద్రకళ ఆరోపించారు. ఈ సారి తప్పనిసరిగా ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్లోని అనేక సమస్యలు పేరుకుపోయాయని.. వాటన్నింటి పరిష్కరించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.