ETV Bharat / city

జేఈఈ మెయిన్​కు సర్వం సిద్ధం.. కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి - జేఈఈ మెయిన్ పరీక్ష

కరోనా నియంత్రణ జాగ్రత్త చర్యలతో రేపటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఇవాళ బీఆర్క్, రేపటి నుంచి 6వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం... రెండో విడత పరీక్ష ఆన్‌లైన్‌లో జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు ఎనిమిదిన్నర లక్షల మంది పరీక్ష రాయనుండగా... రాష్ట్రం నుంచి దాదాపు 67వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ సహా ఆరు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 27 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

complete arrangments for jee main exam with covid precautions
జేఈఈ మెయిన్​కు సర్వం సిద్ధం.. కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి
author img

By

Published : Sep 1, 2020, 5:09 AM IST

జేఈఈ మెయిన్​కు సర్వం సిద్ధం.. కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి

దేశంలోని ఐఐటీ, ఎన్​ఐటీ, ట్రిపుల్ఐటీ , జీఎఫ్ఐటీల్లో ప్రవేశాల కోసం సెప్టెంబరు 6 వరకు... జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు బీఆర్క్, బుధవారం నుంచి సెప్టెంబరు 6 వరకు బీటెక్ ప్రవేశాల కోసం 12 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 8లక్షల 58 వేల 273 మంది మెయిన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 224 ప్రాంతాల్లో 605 కేంద్రాల్లో బీటెక్... 489 కేంద్రాల్లో బీఆర్క్ ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ-ఎన్టీఏ ఏర్పాట్లు చేసింది. మంగళవారం నిర్వహించనున్న బీఆర్క్, బీప్లానింగ్ పరీక్షకు దేశవ్యాప్తంగా లక్షా 10వేల మంది హాజరు కానున్నారు. మెయిన్ పరీక్షకు రాష్ట్రంలో 67 వేల 319 మంది దరఖాస్తు చేసుకున్నారు.

జనవరిలో జరిగిన మొదటి జేఈఈ మెయిన్‌తో పోలిస్తే... ఈసారి సుమారు 30వేల మంది విద్యార్థులు తగ్గారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో 27 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. మంగళవారం నాటి బీఆర్క్, బీప్లానింగ్ పరీక్షకు రాష్ట్రంలో దాదాపు 5వేల మంది హాజరు కానున్నారు.

కరోనా పరిస్థితుల దృష్ట్యా పరీక్షకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్... మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది. ఒకేసారి వస్తే గుంపులు ఏర్పడే అవకాశం ఉన్నందున... పరీక్షా కేంద్రాలకు చేరుకునే సమయాన్ని విద్యార్థులకు వేర్వేరుగా కేటాయించి అడ్మిట్ కార్డుపై ముద్రించారు. పరీక్షకు అరగంట ముందు నుంచే గేట్లు మూసివేస్తారు. విద్యార్థులను చేతులతో తనిఖీ చేయరు. మెటల్ డిటెక్టర్లు మాత్రమే వినియోగిస్తారు. పరీక్షా కేంద్రం వద్ద 3మాస్కులు ఇస్తారు. ఇంట్లో ధరించిన మాస్కు పడేసి... కేంద్రం వద్ద ఇచ్చిన మాస్క్‌లనే ఉపయోగించాలని ఎన్టీఏ స్పష్టం చేసింది. తమకు కరోనా లేదని పేర్కొంటూ ఫోటోతో డిక్లరేషన్ పత్రాన్ని నింపి సంతకం చేయాలి. కరోనా లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక గదిలో పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. వ్యక్తిగత నీళ్ల సీసా, శానిటైజర్‌ అనుమతిస్తారు. పరీక్షకు ముందు, తర్వాత పరీక్ష గదిలో తలుపులు, కిటికీలు, ఫర్నీచర్​తోపాటు కంప్యూటర్, అనుబంధ పరికరాలన్నీ శానిటైజ్ చేయాలని ఎన్టీఏ స్పష్టం చేసింది. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థుల మధ్య ఆరడుగుల దూరం ఉండాలని పేర్కొంది.

మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, నగలు, ఎత్తు చెప్పులు, పెద్ద గుండీల చొక్కాలకు అనుమతి ఉండదని ఎన్టీఏ తెలిపింది. రఫ్ వర్క్ కోసం ఒక్కో విద్యార్థికి ఐదు కాగితాలు పరీక్ష కేంద్రాల్లోనే అధికారులు ఇస్తారు. బీఆర్క్, బీప్లానింగ్ అభ్యర్థులు జామెట్రీ బాక్స్, కలర్ పెన్సిళ్లు, క్రేయాన్లను తీసుకెళ్లొచ్చు సూచించింది. అడ్మిట్ కార్డుతో ఆధార్, పాన్, ఓటరు కార్డు వంటి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. పరీక్ష పూర్తయ్యాక గుంపులుగా కాకుండా... కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వెళ్లాలని పేర్కొంది.

ఇదీ చూడండి: 'ఆయన అలంకరించిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.