CM KCR WISHES TO BATHUKAMMA FESTIVAL: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్క పువ్వుతో బతుకమ్మను పేర్చి ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని తెలిపారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక శోభ వెల్లివిరుస్తుందని చెప్పారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం, తెలంగాణ సంస్కృతి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిందని అన్నారు.
దాదాపు రూ.350 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి మంది ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన చీరలను వారికి బతుకమ్మ కానుకగా అందిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల జీవనంలో భాగమైన ‘బతుకమ్మ’ ఖండాంతరాలకు విస్తరించి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. బతుకమ్మ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని సీఎం ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.. పువ్వులను పూజించే గొప్ప వేడుక బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక. - గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిదర్శనం. ఆడబిడ్డలకు ఇది ఎంతో ఇష్టమైన పండగ అని, తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా తీరొక్క పువ్వుతో జరిగే ఈ సంబురాలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
ఇవి చదవండి: