ETV Bharat / city

CM KCR: గోల్కొండ కోటలో 10.30కి కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ - cm kcr on august 15th

పంద్రాగస్టు వేడుకల కోసం గోల్కొండ కోట ముస్తాబైంది. అటు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​.. షెడ్యూల్​ ఖరారైంది. ఇవాళ పదిన్నరకు గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండాను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు.

cm-kcr-schedule-on-august-15th
cm-kcr-schedule-on-august-15th
author img

By

Published : Aug 14, 2021, 7:50 PM IST

Updated : Aug 15, 2021, 6:45 AM IST

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ముందుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద సైనిక వీరుల స్మారకం వద్ద అమరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. అనంతరం గోల్కొండ చేరుకుంటారు. కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో ఉదయం పదిన్నరకు సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

స్వాతంత్ర్య వేడుకల నిర్వహణ కోసం గోల్కొండ కోట వద్ద అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. కొవిడ్ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కళారూపాలను ప్రదర్శించనున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని... స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్​భవన్​లో సాయంత్రం నిర్వహించే ఎట్​హోం కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా రద్దు చేశారు.

ఇదీ చూడండి:

స్వాతి లక్రా, బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర‌ప‌తి విశిష్ట సేవా పోలీసు ప‌త‌కాలు

Last Updated : Aug 15, 2021, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.