ETV Bharat / city

'మార్కెట్​లో అమ్ముడుపోయే పంటలే పండించాలి' - పంట కాలనీలు

నియంత్రిత వ్యవసాగు విధానంపై మూడు రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉన్నతాధికారులు, నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మార్కెట్​లో డిమాండ్​ ఉన్న పంటలనే రైతులు సాగు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో పత్రి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.

cm kcr review on controlled agriculture system in telanagana
'మార్కెట్​లో అమ్ముడుపోయే పంటలే పండించాలి'
author img

By

Published : Jun 4, 2020, 5:05 AM IST

రాష్ట్రంలో పంటల సాగు పద్ధతిగా జరిగేలా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత కసరత్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు, నిపుణులతో మూడు రోజులుగా సీఎం సుదీర్ఘంగా చర్చించారు. వర్షాకాలం నుంచి అమల్లోకి వచ్చే నియంత్రిత సాగు విధానం... ప్రతి సీజన్​లోనూ కొనసాగేలా వ్యవసాయ శాఖ అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మార్కెట్​లో డిమాండ్​ ఉన్న పంటలు మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఆహార భద్రత సాధించినప్పటికీ... పోషకాహార భద్రత సాధించనందున, ప్రజలు బలవర్థక ఆహారం తినడం లేదన్నారు. జీవన ప్రమాణాలతో పాటు రోగనిరోధక శక్తి పెరగే ఆహారాన్ని తినేలా ప్రోత్సహించడంతో పాటు అటువంటి పంటలు పండించాలని చెప్పారు.

వ్యవసాయ పరిశోధన కమిటీ..

రాష్ట్రంలో, దేశంలో ప్రజల ఆహార అలవాట్లపై ఖచ్చితమైన అంచనాలు రూపొందించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకోవాలని సీఎం తెలిపారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో పంటల సాగు జరగాలన్నారు. డిమాండ్, మార్కెటింగ్, ధరలు తదితర అంశాలపై అధ్యయనం కోసం నిపుణులు, నిష్ణాతులతో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీని ప్రభుత్వం నియమిస్తుందని వెల్లడించారు. లాభసాటి పంటలు కమిటీ సూచిస్తుందని, అందుకు అనుగుణంగా పంటలసాగు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అన్ని ఇక్కడే పండించాలి

పండ్లు, కూరగాయలను దిగుమతి చేసుకోకుండా రాష్ట్రంలోనే పండించి స్వయం సమృద్ధి సాధించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల అవసరం ఎక్కువగా ఉంటుందని... పరిసరాల్లో సాగుకు అనువైన నేలలు గుర్తించి రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆలుగడ్డ, అల్లం, ఎల్లిపాయల దిగుమతి చేసుకోకుండా రాష్ట్రంలోనే పండించాలన్న ఆయన... ఎక్కడ పండించాలి, మేలైన సాగు పద్ధతులు తదితరాలపై రైతులకు మార్గదర్శనం చేయాలన్నారు. ఉల్లిగడ్డ లభ్యత, ధరల విషయంలో ప్రతి ఏడాది అనిశ్చితి, అస్పష్టత ఎందుకు ఉండాలని ప్రశ్నించిన ముఖ్యమంత్రి... ఎప్పుడూ కొరత లేకుండా రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు ఉల్లి సాగు జరగాలని తెలిపారు.

యాంత్రీకరణ సాగు..

మంచి పోషకాలున్న చిక్కుడు, మునగ ఎక్కువగా తినేలా ప్రజలను చైతన్య పరచడంతో పాటు సాగు పెంచాలని సీఎం సూచించారు. వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెరగడం కూడా చాలా ముఖ్యమని... ఆధునిక సాగు పద్ధతులను అవలంభించడంతో పాటు యాంత్రీకరణ పెరిగేలా సాగు జరగాలని చెప్పారు. ఎరువులు, పురుగు మందుల వాడకంలో శాస్త్రీయత ఉండాలని, మేలు రకమైన విత్తనాలు వేయాలని తెలిపారు. ఈ అంశాలన్నింటిపై వ్యవసాయ పరిశోధన కమిటీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, తగు సూచనలు ఇస్తుందన్నారు.

పత్తి పరిశోధన, అభివృద్ధి కేంద్రం..

పత్తిలో ఉత్పాదకత పెంచడం, ఎక్కువ మార్కెట్ ఉన్న రకాలు, తదితర విషయాలను అధ్యయనం చేసి సూచనలు ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో పత్తి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. నూలు పొడువు ఎక్కువ ఉండడం వల్ల రాష్ట్రంలో పండే పత్తికి మంచి డిమాండ్ ఉందని, మంచి ధర వస్తుందని తెలిపారు. అయితే మట్టి, పుల్లలు, ఇతర చెత్త కలవడం వల్ల పత్తిలో నాణ్యతతో పాటు ధర కూడా తగ్గుతుందని... ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లుల సామర్థ్యాన్ని అంచనా వేసి అవసరమైతే పత్తి పండే ప్రాంతాల్లోనే కొత్త వాటిని నెలకొల్పాలని సీఎం సూచించారు.

క్రాప్​ కాలనీలు..

రాష్ట్రంలో ఉన్న విభిన్న నేలల్లో ఏ నేల ఏ పంటకు అనువైందో తేల్చి, సాగు చేయడంతో పాటు పంటల కాలనీల కోసం నేలలను విభజించాలని సీఎం చెప్పారు. కొత్త ప్రాజెక్టులు, 24గంటల ఉచిత విద్యుత్ వల్ల ప్రతి ఏటా ఆయకట్టు పెరుగుతోందని... అందుకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ఉద్యానవన శాఖను పరిస్థితులకు అనుగుణంగా మార్చడంతో పాటు పంటల లెక్కలు సరిగ్గా నమోదు చేసేందుకు ప్రత్యేకంగా గణాంక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇదీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్​ కాన్వాయ్​కి ఓవర్​ స్పీడ్​ చలానాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.