ETV Bharat / city

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

author img

By

Published : Feb 22, 2021, 9:55 AM IST

Updated : Feb 22, 2021, 2:44 PM IST

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

09:53 February 22

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

వాణీదేవికి బీ-ఫాం అందించిన సీఎం కేసీఆర్

పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ జిల్లాల నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలతో సీఎం ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పాల్గొన్నారు.  

వాణిదేవికి ముఖ్యమంత్రి కేసీఆర్​ బీ-ఫారం అందించి... నేతలను పరిచయం చేశారు. వాణీదేవి అభ్యర్థిత్వంపై అంతటా మంచి స్పందన ఉందన్న కేసీఆర్... నేతలంతా కష్టపడి పనిచేయాలని ఆదేశించారు. తక్కువ సమయం ఉన్నప్పటికీ నేతలు సొంత ఎన్నికలా బాధ్యతలు తీసుకొని వాణీదేవిని గెలిపించాలన్నారు. అనంతరం నేతలతో కలిసి గన్​పార్క్​ చేరుకున్న వాణీదేవి... నివాళులు అర్పించారు. 

ఇదీ చూడండి: పీవీ ఘాట్​ వద్ద వాణీదేవి నివాళులు.. నేడు నామినేషన్ దాఖలు

Last Updated : Feb 22, 2021, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.