US Green Card Validity Extension : గ్రీన్ కార్డు హోల్డర్లకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పర్మనెంట్ రెసిడెంట్ కార్డుల(గ్రీన్ కార్డు) వ్యాలిడిటీని మరింత పొడిగించింది. గతంలో గ్రీన్‌కార్డు గడువు తీరినప్పటికీ, మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీని పొడిగించేవారు. ఇప్పుడు ఈ కాలాన్ని 36 నెలలకు పెంచినట్లు యూఎస్ పౌరసత్వ, వలస సేవల సంస్థ-USCIS తెలిపింది. దీంతో గ్రీన్‌కార్డు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఊరట లభించినట్లు అయింది.
సాధారణంగా యూఎస్‌లో గ్రీన్‌కార్డులు పొందినవారు, పదేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. దీనికోసం కార్డు గడువు తీరిపోయే కాలానికి ఆరు నెలల ముందే ఐ-90 అనే ఫామ్‌ను సమర్పించాలి. రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి కార్డు వ్యాలిడిటీని 24 నెలలు పొడిగిస్తూ రిసీట్ నోటీసు ఇస్తారు. దీంతో గ్రీన్‌కార్డు గడువు తీరిపోయినప్పటికీ, ఈ నోటీసుతో వారికి లీగల్‌గా నివాస హోదా కొనసాగుతుంది. కొత్త కార్డు జారీ అయ్యే వరకు ఉద్యోగాలు, ప్రయాణాల సమయంలో వారు దాన్ని చట్టబద్ధమైన స్టేటస్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చు.
అలా చేస్తే పదేళ్ల గ్రీన్‌కార్డు!
తాజాగా, ఈ గ్రీన్‌కార్డు వ్యాలిడిటీని 36 నెలలకు పెంచారు. దీంతో కొత్త కార్డుల కోసం వేచిచూసే వారు మరింతకాలం చట్టబద్ధంగా శాశ్వత నివాస హోదాను కొనసాగించేందుకు వీలు లభించినట్లు అవుతుంది. కాగా, కండిషనల్ రెసిడెన్సీ తీసుకునేవారి గ్రీన్‌కార్డుల గడువు రెండు సంవత్సరాల పాటు మాత్రమే ఉంటుంది. అయితే వీరికి తాజా పొడిగింపు వర్తించదు. ఇలాంటి వారు మొదటగా నివాస హోదాపై ఉన్న కండీషన్స్ తొలగించుకునేందుకు దరఖాస్తు చేసుకోల్సి ఉంటుంది. కార్డు గడువు తీరే 90 రోజుల్లోపు దీన్ని చేసుకోవాలి. దరఖాస్తు అనుమతి పొందితే, వారికి 10ఏళ్ల కాలానికి గ్రీన్‌కార్డు వస్తుంది.
Trump Promises US Green Card For Foreigners : అమెరికా కళాశాలల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు ట్రంప్ గతంలో ప్రకటించారు. 2024 జూన్‌లో టెక్ పెట్టుబడిదారులతో కలిసి ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ట్రంప్, వలసదారులపై ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో అమెరికాలో వలసదారులపై చేసిన వ్యాఖ్యలకు ఇవి పూర్తి భిన్నంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
భారతీయులకు గ్రీన్ కార్డుల జారీపై అమెరికా 'కీలక' నిర్ణయం.. మోదీ పర్యటనకు ముందే..
భారతీయులకు గుడ్‌న్యూస్.. గ్రీన్‌కార్డు దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం!