YSR EBC Nestham scheme: అగ్రవర్ణ మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని నేడు ఆ రాష్ట్ర సీఎం జగన్ ప్రారంభించనున్నారు. వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏపీలోని 3.92 లక్షల మందికి లబ్ధిదారులకు రూ.589 కోట్లు విడుదల చేయనున్నారు.
కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జగన్ ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు సాయం చేయనున్నారు. 45 నుంచి 60 ఏళ్లలోపు పేద అగ్రవర్ణ మహిళలు ఈ పథకానికి అర్హులు. బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, వెలమ, ఇతర మహిళలకు ఈబీసీ నేస్తం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది.
ఇదీ చదవండి: 'భాగ్యనగర శివార్లలో మౌలిక వసతులు పెంచుతున్నాం'