ETV Bharat / city

Power Crisis: 'నిధులకు ఇబ్బంది లేదు.. కరెంట్​ కోతలు లేకుండా చూడండి' - విద్యుత్తు సమస్యపై సీఎం సమీక్ష

కరెంటు కోతలు లేకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. కరెంటుపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ సంక్షోభం నుంచి ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు.

cm-jagan-review-on-power-sector-with-officials-to-deal-with-power-shortage-in-the-state

author img

By

Published : Oct 14, 2021, 7:00 PM IST

ఏపీలో ఎక్కడా కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కరెంటు పరిస్థితులపై అధికారులతో జరిపిన సమీక్షలో(cm jagan review on power sector with officials) సూచించారు. వివిధ థర్మల్‌ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై సీఎం ఆరా తీశారు. థర్మల్‌ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

నిధులకు ఇబ్బంది లేదు..

దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన బొగ్గు కొనుగోలు చేయాలన్న సీఎం.. అందుకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పుడున్న థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలని సూచించారు. కృష్ణపట్నం, వీటీపీఎస్​లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సింగరేణి సంస్థతో కూడా సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గు తెప్పించుకోవాలన్నారు. కేంద్రంలో సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని.. ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.