CM jagan on cyclone: 'అసని' తుపాను పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు.. సీఎం దిశానిర్దేశం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై పలు ఆదేశాలిచ్చారు. అప్రమత్తంగా ఉండాలని.. ఇప్పటికే నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమన్నారు. తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశంగా అభిప్రాయపడ్డారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని తెలిపారు. ఈ సమావేశంలో హోంమంత్రి, సీఎస్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి రూ. 1000 ఇవ్వాలని... కుటుంబానికి రూ.2 వేలు చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో మంచి నీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని.. జనరేటర్లు, జేసీబీలు కూడా సిద్ధం చేయాలని సీఎం జగన్ సూచించారు.
ఇవీ చదవండి: ఆగని ఆగ్రహజ్వాల.. శ్రీలంక భవిష్యత్ ఏంటి? భారత్ ఏం చేయనుంది?
Asani Cyclone Effect on AP : నేలరాలిన పంటలు.. తడిసిముద్దయిన ధాన్యం