YSR Rythu Bharosa Funds : వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ నిధులను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నేడు విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుంచే 50.58 లక్షల మంది రైతులకు.. రూ.1036 కోట్లను... రైతుల ఖాతాల్లో జమ చేశారు.
'రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా ప్రభుత్వం.. రూ. 13 వేల 500 అందిస్తోంది. తొలి విడతగా పంట వేసేముందు మే నెలలో 7 వేల 500, రెండో విడతగా అక్టోబరులోపు రూ. 4వేలు, మూడో విడతగా సంక్రాంతికి రూ. 2వేలు ఇస్తున్నారు. ప్రస్తుతం విడుదల చేస్తున్న మొత్తంతో కలిపి రూ. 19,813 కోట్ల సాయాన్ని రైతులకు అందించాం' అని ఆ రాష్ట్ర సర్కారు తెలిపింది.
ఇదీ చూడండి: Nandamuri Ramakrishna: 'ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసమంటే.. తెలుగుజాతిని అవమానించినట్లే..'