ETV Bharat / city

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: ఏపీ సీఎం జగన్

రైతుభరోసా నిధులు, నివర్‌ తుపాను పరిహారాన్ని రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమ చేసింది. ఈమేరకు 1766 కోట్ల రూపాయలను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ విడుదల చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం తమదన్నారు. అందుకే తొలినుంచీ అన్నదాతల సంక్షేమానికి పాటుపడుతున్నామని జగన్‌ స్పష్టం చేశారు. దేశంలో మరెక్కడా రైతుల కోసం ఇన్ని పథకాలు లేవన్నారు.

jagan
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: ఏపీ సీఎం జగన్
author img

By

Published : Dec 29, 2020, 3:09 PM IST

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రైతుల ఖాతాల్లోకి పంట పెట్టుబడి రాయితీతో పాటు.. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా నిధులను సీఎం జగన్​ విడుదల చేశారు. నివర్ తుపానుతో నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ సైతం ఇస్తున్నట్టు తెలిపారు. రైతులకు మంచి ధరలు రావాలనేదే లక్ష్యమన్న ముఖ్యమంత్రి జగన్​.. వారి ఖాతాల్లో రూ.1,766 కోట్లు జమ చేస్తున్నామని వెల్లడించారు. వారి కోసం 18 నెలల కాలంలో రూ.61,400 కోట్లు వెచ్చించామని చెప్పారు. 8 లక్షల 34 వేల మంది రైతులకు రూ.646 కోట్ల పెట్టుబడి రాయితీ అందించనున్నట్లు తెలిపారు.

రైతుభరోసా మూడో విడత కింద రూ.1,120 కోట్లు రైతులకు ఇస్తున్నామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.13,500 రైతు భరోసాగా ఇస్తున్నామన్నారు. రైతుల నుంచి రూపాయి మాత్రమే తీసుకుని పంటలకు బీమా కల్పిస్తున్నామని చెప్పారు. పగటిపూట 9 గంటల విద్యుత్ కోసం రూ.1700 కోట్లు వెచ్చించామన్న ఏపీ ముఖ్యమంత్రి.. 18 నెలల్లో రైతుల కోసం 61 వేల 400 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు.

రైతులకు ఉచిత విద్యుత్ పథకం శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్​ హామీ ఇచ్చారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ ఏర్పాటుకు టెండర్లు పిలిచామన్నారు. రైతు భరోసా కేంద్రాలు సహా గ్రామాల్లో జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం బాగుపడేందుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. శీతల గోదాంలు, పరికరాల కోసం రూ.10 వేల కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. రంగు మారిన, తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్న జగన్.. 73 వేల టన్నుల రంగు మారిన ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. 80 శాతం రాయితీతో 43 వేల క్వింటాళ్లు రైతులకు పంపిణీ చేశామని సీఎం జగన్ వివరించారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: ఏపీ సీఎం జగన్

ఇవీచూడండి: గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ ప్రయత్నం అభినందనీయం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.