హైదరాబాద్‌లోని ఆగాపురాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జాంబాగ్ డివిజన్ తెరాస అభ్యర్థి ఆనంద్ గౌడ్‌పై ఎంఐఎం నాయకులు దాడికి యత్నించారు. జూబ్లీ హైస్కూలు పోలింగ్ భూత్‌లో రిగ్గింగ్ చేస్తున్నారని ఆనంద్ గౌడ్ ఆందోళన చేపట్టారు.
ఎంఐఎం నాయకులను భూత్‌ల నుంచి బయటకు పంపాలని పోలీసులను కోరినా... సహకరించడం లేదని ఆనంద్‌గౌడ్ ఆరోపించారు. పోలీసులు ఎంఐఎంకు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొనగా... ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.