ఏపీ సీఎం జగన్‌ను సినీ నిర్మాతలు దగ్గుబాటి సురేశ్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, జెమినీ కిరణ్, వల్లభనేని వంశీ కలిశారు. హుద్ హుద్ సమయంలో సినీ పరిశ్రమ నిధులు సేకరించిందని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. ఆ నిధులతో విశాఖలో తుపాను బాధితులకు ఇల్లు కట్టించామని నిర్మాత దగ్గుబాటి సురేశ్ తెలిపారు. దాదాపు రూ.15 కోట్లతో 320 ఇళ్లు కట్టించినట్లు వెల్లడించారు. విశాఖలో గృహ సముదాయాల ప్రారంభానికి ముఖ్యమంత్రి రావాలని కోరామని.. తమ ఆహ్వానానికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సమీక్షలో సన్నాయి మేళం.. ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి