ETV Bharat / city

మాజీ మంత్రి దేవినేని ఉమకు మరోసారి సీఐడీ నోటీసులు - దేవినేని ఉమపై సీఐడీ కేసు

ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమకు మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసింది. గొల్లపూడిలోని ఉమ నివాసానికి రెండోసారి అధికారులు నోటీసులు అంటించారు. ఈనెల 19న కర్నూలు సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ex minister devineni uma
మాజీ మంత్రి దేవినేని ఉమ
author img

By

Published : Apr 17, 2021, 1:06 PM IST

ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి దేవినేని ఉమకు మరోసారి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గొల్లపూడిలోని ఉమ నివాసానికి రెండోసారి నోటీసులు అంటించారు. ఈనెల 19న కర్నూలు సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 15న దేవినేనికి మొదటి నోటీసు ఇచ్చారు. అప్పుడు దేవినేని ఉమ.. తనకు 10 రోజులు సమయం కోరారు.

జగన్‌ మాటలను వక్రీకరించారన్న న్యాయవాది ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. మీడియా సమావేశంలో మార్ఫింగ్‌ చేసిన జగన్‌ వీడియోలు ప్రదర్శించారని అభియోగం నమోదు చేశారు. ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 464, 465, 468, 469, 470, 471, 505, 1200 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: సాగర్ సమరం : ఓటు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.