ETV Bharat / city

ఏవోబీ ఎన్​కౌంటర్​లో గాయపడిన నక్సల్స్​ లొంగిపోవాలి: ఏఎస్పీ - vishaka encounter news

అమాయక గిరిజనులను మభ్యపెట్టి మావోయిస్టులు దళంలో చేర్చుకున్నారని ఏపీలోని విశాఖ జిల్లా చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. వీరిని అడ్డుపెట్టుకుని ఎన్​కౌంటర్​లలో సీనియర్లు తప్పించుకుంటున్నారన్నారు. దిగజనబ అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పులో ఏవరైనా గాయపడి ఉంటే వారు లొంగిపోవాలని సూచించారు. వారికి తక్షణం వైద్య సహాయం అందిస్తామని తెలిపారు.

chintapalli asp on mavos
కాల్పుల్లో గాయపడిన వారు లొంగిపోతే వైద్య సహాయం చేస్తాం: ఏఎస్పీ
author img

By

Published : Jul 27, 2020, 8:06 PM IST

అమాయకులను మానవ కవచాలుగా ఉపయోగించుకుని ఎన్​కౌంటర్లలో మావోయిస్టు సీనియర్లు తప్పించుకుంటున్నారని విశాఖ చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. పక్కా సమాచారంతోనే ఒరిస్సా, విశాఖ పోలీసు బలగాలు సంయుక్తంగా ఎన్​కౌంటర్​లో పాల్గొన్నాయన్నారు. మావోయిస్టులు హింస వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి వస్తే ప్రభుత్వ పరంగా లభించే పునరావాస పథకాలు అందిస్తామన్నారు.

దిగజనబ అటవీ ప్రాంతంలో గాలింపు బలగాల లక్ష్యంగా మావోలు కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపాయన్నారు. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మరణించగా.. మావో అగ్రనేతలు తప్పించుకున్నారన్నారు. ఈ కాల్పుల్లో ఎవరైనా గాయపడిన వారు.. లొంగిపోతే తక్షణం వైద్య సహాయం అందిస్తామని చింతపల్లి ఏఎస్పీ తెలిపారు.

ఇవీచూడండి: ఓ కట్టు కథ అల్లారు... రూ.1.45లక్షలు దోచారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.