చైనాలో ఒక యువతి.. ఐదేళ్లుగా ఓ ఆఫీసులో పని చేస్తోంది. అందరితో కలిసిపోయే రకం. కుళ్లు, కుతంత్రాలు వంటివి తెలియదు. స్వచ్ఛంగా నవ్వుతూ.. అందరూ తనవాళ్లుగా భావించేది. ఆమె పని చేస్తున్న ఆఫీసులో మొత్తం 70 మంది స్టాఫ్ ఉన్నారు. వీరందరితో కలివిడిగా ఉండేది. ఈ 70 మందిలో దాదాపు మూడొంతుల మంది పెళ్లిళ్లకు వెళ్లింది. అంటే.. ఆల్మోస్ట్ తాను ఆఫీసులో చేరిన తర్వాత జరిగిన అందరి పెళ్లిళ్లకీ వెళ్లింది. వన్ ఫైన్ డే.. ఈ యువతికి పెళ్లి కుదిరింది. ఎవరి జీవితంలోనైనా పెళ్లి అద్భుత ఘట్టం. ఆ రోజున తన వాళ్లు అనుకునే వారు ఆ సంతోషంలో భాగం కావాలని అందరూ కోరుకుంటారు. ఈ యువతి రెండింతలు ఎక్కువగానే కోరుకుంది.
ఆఫీసులోని ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పిలిచింది. చాలా మంది ఒక్క కార్డుపై డిపార్ట్మెంట్ పేరు రాసి.. "వెల్కమ్ ఆల్" అని మెన్షన్ చేస్తే.. ఈమె మాత్రం ప్రతి ఒక్కరికీ శుభలేఖ అందించింది. ఎవరినైనా మరిచిపోతే.. వారు ఫీలవుతారేమోనని.. గుర్తు తెచ్చుకొని మరీ.. ఆహ్వానించింది. తప్పకుండా ఫ్యామిలీతో రావాలని కోరింది. చూస్తుండగానే పెళ్లి రోజు రానే వచ్చింది. తన ఆఫీస్ మేట్స్‌కి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని తన వాళ్లకు స్పెషల్‌గా చెప్పింది. భర్తకు సైతం తన సహోద్యోగుల గురించి గొప్పగా చెప్పింది.
అందుకు అనుగుణంగానే.. పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయించింది. పెళ్లిలో పరిచయస్థులు, బంధువుల సంగతి ఎలా ఉన్నా.. దోస్తులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. తాను పెళ్లిలో బిజీగా ఉండిపోతే.. తన దోస్తులను చూసుకోవడం ఇబ్బంది అవుతుందేమో అని ముందుగానే.. వారికి కావాల్సినవన్నీ సిద్ధం చేయించింది ఆ యువతి. గ్రాండ్‌గా డిజైన్ చేసిన.. 6 టేబుల్స్‌ను మిత్రుల కోసం రిజర్వ్ చేసింది. వాటిని ఎవరికీ కేటాయించొద్దని స్ట్రిక్ట్‌గా చెప్పేసింది. ఈ భారీ టేబుళ్ల పరిధిలో కంఫర్ట్‌గా ఉండే 70 కుర్చీలను ఏర్పాటు చేయించింది. ఇక, తిండీ తిప్పల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆల్ వెరైటీస్.. కావాల్సినంత కుమ్మేసేలా సప్లై చేయాలని ఆదేశించి, పెళ్లి మండపంలోకి వెళ్లిపోయింది. పెళ్లి తంతు కొనసాగుతోంది.. కొనసాగుతోంది.. కొనసాగుతూ..నే ఉంది.. చివరికి ముగిసింది!
సీన్ కట్ చేస్తే.. ఆమె రిజర్వ్ చేసిన 70 సీట్లలో.. ఒకే ఒక్క సీటు మాత్రమే నిండింది. ఆ వచ్చిన వ్యక్తి కూడా.. ఆమె కింద పనిచేసే ట్రైనీ..! బహుశా.. మేడం పెళ్లికి వెళ్లకపోతే ఇబ్బంది అవుతుందేమోనని భయపడి వచ్చి ఉంటాడు. అవమానం..! ఘోర అవమానం..!! తన వాళ్ల ముందు.. భర్త ముందు మౌనంగా తల దించుకుంది. మనసులో రోదించింది. ఆ పరిస్థితిని ఎంత మాత్రమూ జీర్ణించుకోలేకపోయింది.
"ఇంతకాలం నేను కలిసి పనిచేసింది ఇలాంటి వాళ్లతోనా? అందరూ నా వాళ్లు అనుకున్నాను. కానీ.. మీ మనసులో నా స్థానం ఏంటో నాకు ఇవాళ సరిగ్గా అర్థమైంది. మీలాంటి వాళ్లతో ఇక నేను కలిసి పనిచేయలేను. అందుకే.. మీతో స్నేహానికీ.. నా ఉద్యోగానికీ.. రాజీనామా చేస్తున్నాను." అని లెటర్ రాసి.. గుడ్ బై చెప్పింది.
చైనా సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అయ్యింది. అయితే.. నెటిజన్స్ రెండుగా చీలిపోయారు. ఒక వర్గం ఆమెకు మద్దతుగా నిలిచారు. అలాంటి ఉద్యోగులను వదిలి పెట్టడమే మంచిది అని అన్నారు. మరో వర్గం మాత్రం ఆమె నిర్ణయంతో ఏకీభవించలేదు. ఆమె వారి నుంచి ఎక్కువగా ఆశించిందని.. ఎక్స్పెక్టేషన్స్ అతిగా పెట్టుకుంటే.. ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని కామెంట్ చేశారు. మరి, మీరు ఎటువైపు ఉంటారు???
వీటిపై ఓ క్లిక్కేయండి..
- అక్కడ రాళ్లు నడుస్తాయి.. పరిగెడతాయి..!!
- మనుషులకు తోకలు మొలుస్తున్నాయ్.. ఇట్స్ ట్రూ యార్..!
- ఫైవ్ స్టార్ హోటల్లో పందుల పెంపకం.. ఇదేందయ్యా ఇదీ..!?
- "యువరానర్.. దిసీజ్ వెరీ దారుణం.. ఈ కోడి పుంజును శిక్షించండి".. కోర్టుకెళ్లిన దంపతులు!!
- అక్కడ ఉద్యోగులు తప్పుచేస్తే.. పచ్చి కోడిగుడ్లు, బొద్దింకలు మింగాలి!!
- ఇదేం వింత సామీ.. ఆక్సిజన్ లేకుండానే బతికేస్తోంది..!!